ఏసీబీ వలలో ఎంవీఐ
నంద్యాల డిశంబరు 7
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు దాడులుజరిపారు. రూ
8000 లంచం తీసుకుంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, .శ్రీనివాస రావు దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో మద్యవర్తిగా వున్న ట్రాన్స్ ఫోర్ట్ ఏజెంట్ నరసింహులు లు కుడా అదుపులోకి తీసుకున్నారు. ఒక జీపు రెనెవల్ రిజిస్ట్రేషన్ కోసం వీరిద్దరూ లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.