ప్రజలకు,మరియు ముఖ్యంగా వార్డ్ కౌన్సిలర్లకు ... యువతకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పోలీసు వారి విజ్ఞప్తి.
వేసవి కాలం సమీపించింది. ఈ వేసవిలో కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే అంతా సుఖాంతమే మరి..
1 . వేసవి కాలము లో వేసవి వేడి ని, ఉక్కపోత ను తట్టుకోలేక ప్రజలు రాత్రి సమయంలో చల్లని గాలి కోసం ఇంటి బయట ఆవరణలో నిద్రించేందుకు ఇష్టపడతారు .. ఇదే అవకాశంగా తీసుకొని మహిళలు అధమరచి నిద్ర పోతున్న సమయంలో దొంగలు మహిళల మెడలో, ఒంటి పైన ధరించిన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే ప్రమాధమున్నది.
కావున వేసవి కాలము , మహిళలు ,పురుషులు బంగారు ఆభరణాలు ధరించి ఇంటి బయట గానీ మిద్దెమీదగాని నిద్రించవద్దు. అధ మరచి నిద్రించారాదు.
అదేవిధంగా మీ యొక్క సెల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తున్న, లేదా మీ తల గడ దగ్గర, మంచం పక్కనే పెట్టి అధమరచి నిద్రిస్తున్న సమయంలో మీ యొక్క విలువైన స్మార్ట్ సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లేందుకు అవకాశం ఉంది. కావున జాగ్రత్త పడగలరు
2. ఇంటి తలపులు తెరచి లోపల పడుకోవద్దు .
ఇంటిలోపల పడుకున్నప్పుడు లోపల నుండి డోర్స్ లాక్ చేసుకోవటం మర్చి పోవద్దు .
4. ఇంట్లో వారందరు శుభకార్యాలకు ఊరు వెల్లాల్సి వస్తే మీ విలువైన బంగారు , వెండి ఆభరణాలు , డబ్బులు బ్యాంక్ లాకర్ లో పెట్టండి . బీరువా తాళం, ఇంటి తాళాలు వెంట పెట్టుకొని వెళ్లగలరు.
5. బంగారు వస్తువులు మెరుగు పెడతామని ఎవరయినా మీ ఇంటికి వస్తే వారిని నమ్మవద్దు , వెంటనే మాకు 100 నంబర్ కు సమచారం ఇవ్వండి .
6. ఇంటిలో శాంతి పూజలు చేస్తామన, పూజలో బంగారు వస్తువులు పెట్టమని మాయగాళ్లు చెపుతారు నమ్మవద్దు , అలాంటి వారు వస్తే మాకు వెంటనె 100 లేదా మీ లోకల్ పోలీస్ వారి నంబర్ కు సమాచారం ఇవ్వండి .
7. తక్కువ ధరకే బంగారం ఇస్తామని ముందు చిన్న బంగారం వస్తువు చూపించి తరువాత నకిలీ బంగారు బిస్కట్స్ , నకిలీ వడ్డాణాలు ,నకిలి నకిలెస్ లు అమ్ముతారు నమ్మి మోసపోవద్దు .
మీరు నడచి వెళ్ళే దారిలో నకిలీ బంగారపు వస్తువును మీరు గమనించే లా పడవేసి, దానిని గమనించి ఆ వస్తువు దగ్గరకు వెళ్ళగానే గుర్తుతెలియని వ్యక్తులు మీ వద్దకు వచ్చి దొరికిన నకిలీ బంగారపు వస్తువును నిజమైన బంగారపు వస్తువుగా నమ్మించి మీ దగ్గర ఉన్న నిజమైన బంగారాన్ని వారు తీసుకొని మీకు నకిలీ బంగారాన్ని అప్పజెప్పుతారు..
8. బస్సుల్లో ఆటోల్లో ప్రయాణించేటపుడు మీ బంగారము , డబ్బులు పర్సులో పెట్టి బ్యాగ్ లో పెట్టినపుడు దొంగలు తోటి ప్రయాణికుల వలే నటించి మీకు తెలియకుండానే మీ బంగారం మరియు డబ్బులు దొంగిలిస్తారు జాగ్రత్త ...అపరిచితులు ఏమైనా తినుబండారాలు ఇచ్చిన వాటిని మీరు తినవద్దు. ఎందుకనగా తినుబండరాలలో మత్తు మందు కలిపి మిమ్ములను స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆ తరువాత మీ దగ్గర గల బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తారు.. జాగ్రత.
9. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి , ద్విచక్ర వాహనాన్ని భద్రత వున్న ప్రదేశంలో పార్కింగ్ చేయవలెను.ఇంటి బయట పార్కింగ్ చేయరాదు. కనుచూపు మేరలో పార్కింగ్ చేసుకొనవలెను. అరిగిపోయిన తాళాలు వెంటనే మార్చుకోండి లేకపోతే దొంగలు వెరే దొంగ తాళాలతో మీ వాహనాలు దొంగిలిస్తారు ,
10. బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేసుకొని తీసుకొని వస్తున్నపుడు క్రింద డబ్బుల నోట్లు వేసి మీ ద్రుష్టి మళ్లించి మీ డబ్బులు, బ్యాగ్ దొంగిలిస్తారు జాగ్రత .....
11 .మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం గల తాళం వేయించుకోండి / పెట్టించుకొండి . వ్యాపారస్తులు తమ వ్యాపార భవనముల యొక్క షట్టర్ లకు, డోర్ లకు సెంట్రల్ లాక్ సిస్టం ను ఏర్పాటు చేయించుకోండి. మరియు వ్యాపార భవనముల ముందు,లోపల సీసీ కెమెరా లు అమార్చుకోగలరు.
12 .వృద్దుల వంటిపై బంగారము ఆభరణాలు ఉన్నపుడు వారిని ఒంటరిగా ఇంటిలో ఉంచరాదు మరియు వారిని ఒంటరిగా బయటకి పంపరాదు .ముఖ్యంగా మహిళలు బయటకు వెళుతున్నప్పుడు మీరు ధరించిన ఆభరణాలను గుర్తుతెలియని వారు , వెనక నుండి గానీ, ముందు నుండి గాని ద్విచక్ర వాహనం పైన వచ్చి మేడలో ఉన్న ఆభరణాలను లాక్కొని వెళ్లే అవకాశం కలదు.
ఫోన్ కాల్స్ పట్ల అప్రమతంగా ఉండండి. ఇటీవల ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
1)ఇటీవల బ్యాంక్ అధికారులమంటూ, మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ అక్కౌంట్ హాక్ కాకుండా బ్లాక్ చేస్తామని చెపుతూ కొద్దిమంది నేరగాళ్లు అమాయకుల అకౌంట్ నుండి డబ్బులు మాయం చేయడం సాధారణం అయిపోయింది.
2)బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము, మీ ఏటీఎం పిన్ నెంబర్ గాని, ఏటీఎం పైన గల నెంబర్ గాని,లేదా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అడిగితే చెప్పకూడదు. చెప్పినచో మీ డబ్బులు ఆన్ లైన్ లో డ్రా చేసుకుంటారు.
3)ఎటిఎం కు వెళ్ళినపుడు వీలైనంత వరకు ఇతరుల సహాయం తీసుకోరాదు మరియు ఇతరులకు మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పవద్దు.
4) కావున బ్యాంకు అధికారులమని మీ నెంబర్ కి ఎవరినుండ్డి ఫోన్ వచ్చినా నమ్మకండి !
5) మీ క్రెడిట్ కార్డు నెంబర్ , డెబిట్ కార్డ్ నెంబర్ ఎవరికీ చెప్పకండి. ఎవరికైనా చెప్పారో కొన్ని క్షణాల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు డ్రా చేసుకుంటారు !
6) మీ ఓ టీ పీ నెంబర్ కూడా ఎవరికి చెప్పకండి. అప్రమతంగా ఉండండి. మీ బ్యాంక్ లోని సొమ్ముని భద్రముగా ఉంచుకోండి.
అపరిచిత మెయిల్ ద్వారా గాని, ఫోన్ కాల్స్ ద్వారా గాని, మెసేజ్ ద్వారా గాని మీరు లక్కీ డ్రా లో నగదు బహుమతి, విలువైన వస్తువులు గెలుపొందినారు.అట్టి నగదు ,విలువైన వస్తువులు పొందాలంటే ట్రాన్సపోర్ట్ ఖర్చులకు కొంత నగదును మా అకౌంట్ నెంబర్ కు డిపాజిట్ చేయండి.మీరు గెలుపొందిన బహుమతులు పంపిస్తాం అని చెబుతారు. అట్టి తప్పుడు సమాచారం నమ్మకండి.
దయచేసి మరొక్కసారి గ్రామ సర్పంచ్ లకు , ఎంపీటీసీ లకు , గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు అందరికీ తెలియజేస్తున్నాం.... పై అంశాలను మీ మీ గ్రామాలలో మైక్ ల ద్వారా, డప్పు చాటింపుల ద్వారా, సిటీ కేబుల్ ద్వారా, కరపత్రాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా పై సమాచారాన్ని చేరవేసి ..అమాయకులను మోసగాళ్ల బారిన పడకుండా , దొంగతనలు జరగకుండా కాపాడటంలో భాగస్వాములు కండి !!!