YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఫారెస్టు కాలేజీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఫారెస్టు కాలేజీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఫారెస్టు కాలేజీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ డిసెంబర్ 7 
ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆదే రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు.  ఉదయం 11 గంటలకు ములుగులో నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హర్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. తమిళనాడులోని మెట్టుపాలయంలో అక్కడి ప్రభుత్వం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసింది. దీని ఫలితంగా అక్కడ నుంచి దాదాపు 120 మంది ఐఎఫ్ఎస్ అధికారులుగా ఎంపికయ్యే అవకాశం దక్కింది. దీనిని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ విద్యార్థులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మొట్టమొదటి సారిగా 2016లో తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కాలేజి కోసం ములుగులో విశాలమైన ప్రాంగంణంలో భవన సముదాయం నిర్మించారు. ఈ భవన సముదాయానికి ముఖ్యమంత్రి 11న ప్రారంభోత్సవం చేస్తారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవాల అభివృద్ధి, పరిశోధన కోసం ములుగులో హర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీ భవన సముదాయాన్ని కూడా ముఖ్యమంత్రి అదే రోజు ప్రారంభిస్తారు. అటవీశాఖ మంత్రి ఐకె ఇంద్రకరణ్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Related Posts