YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రైతుల చెల్లింపులు వేగవంతం

రైతుల చెల్లింపులు వేగవంతం

రైతుల చెల్లింపులు వేగవంతం
ఏలూరు, డిసెంబర్ 07,
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో రైతులు పండించిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చెల్లింపులు ముమ్మరం చేయాలని జాయింట్ కలెక్టర్ యం.వేణుగోపాల రెడ్డి అధికారులను కోరారు. శనివారం ఉదయం జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డి జిల్లా, డివిజనల్, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవశకం, అమ్మ ఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు, హౌసింగ్ కొరకు భూసేకరణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ రైతుల నుండి  లక్షా 50 వేల టన్నుల ధాన్యాన్ని పిపిసి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని, సుమారు 16 వేల మంది రైతులు ఈ కేంద్రాల సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. ధాన్యం సేకరణలో ఈ పంట నమోదుకు సంబంధించి రైతులకు సమస్యలు ఎదురైతే, యంపిఈఓలు 24 గంటలలోపు వాటిని పరిష్కరించాలని  ఆదేశించారు. తాసిల్ధారులు ప్రతి రోజు కనీసం రెండు పిపిసి కేంద్రాలను సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించి, సమస్యలేమైనా  ఉంటే వెంటనే చక్కదిద్దాలని ఆదేశించారు. మిల్లర్లు ఎవరైనా ధాన్యం  కొనుగోలుకు నిరాకరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, అటువంటి మిల్లర్లు సేకరణ, మిల్లింగ్ ప్రక్రియల్లో అవకాశాలను కోల్పోతారని స్పష్టం చేశారు. రైతు భరోసా పధకం సహాయాల పంపిణీలో మనుగడలో లేని బ్యాంక్ అకౌంట్లును పునరుద్దరించి చెల్లింపులు సత్వరం అందజేయాలని ఆదేశించారు. సిసిఆర్ సి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని, దేవాదాయ భూములు కౌలు చేస్తున్న 2400 మంది రైతులకు కూడా ఈ కార్డులు జారీ చేయాలని తెలిపారు. నవశకం కార్యక్రమం ద్వారా బియ్యం, పింఛన్, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన కార్డుల జారీకి డేటా ఎంట్రీ ప్రక్రియ ఈ నెల 10వ తేది లో పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మ ఒడి పథకం అమలుకు తల్లుల నుండి ఆధార్ లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాల సేకరణ, విద్యార్ధులకు ఆధార్ నంబర్ల కల్పన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దర్జీలు,నాయి బ్రాహ్మణులు, రజకులు, ఇమామ్ లు, పాస్టర్లు, అర్చకులకు ఆర్ధిక సహాయల పంపీణీ పథకాల లబ్ధిదారుల గుర్తింపు త్వరితగతిన  నిర్వహించాలని కోరారు. కాపు నేస్తం పథకం లబ్ధిదారులకు కులధృవ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. గృహనిర్మణం కొరకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రూపొందించిన వెబ్ సైట్ ల గురించి వివరించి, భూసేకరణ ప్రతిపాదనలను, ఉపాధి హామీ పధకం ద్వారా జిల్లాలో హౌసింగ్ స్థలాల లెవెలింగ్, లేఆవుట్ల కొరకు ఎస్టిస్టేమేట్లు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను కోరారు.  ఈ సమవేశంలో జాయింట్ కలెక్టర్-2 ఎన్.తేజ్ భరత్, డిఈఓ సివి.రేణుక, హౌసింగ్ పిడి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ జేడి గౌసియా బేగం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Related Posts