YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంతుంది: హరీశ్‌రావు

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంతుంది: హరీశ్‌రావు

దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంతుంది: హరీశ్‌రావు
హైదరాబాద్ 
దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని రాజ్‌భవన్ రోడ్‌లోని రూట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, కృత్రిమ అవయవాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్యూర్ సంస్థ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేస్తున్న సేవకు అభినందనలు తెలిపారు. దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదన్నారు. అలా చిన్న చూపు చేసే వారిలోనే లోపం ఉందన్నారు. డబ్బులు బాగా సంపాదించేవారు కొంత స్వార్థం మాని సమాజానికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఏదీ శాశ్వతం కాదు. మనం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయన్నారు. దివ్యాంగుల పెన్షన్ ప్రభుత్వం రూ.300 నుంచి రూ. 3 వేలకు పెంచింది. అదేవిధంగా ఉద్యోగాల రిజర్వేషన్లలో 3 శాతం నుంచి 4 శాతానికి పెంచింది. సంక్షేమ పథకాల్లో ఐదు శాతం దివ్యాంగులకు చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో 70 శాతం శారీరక వైకల్యం ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 40 శాతం ఉన్నా అన్నా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తున్నామన్నారు. దివ్యాంగులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Related Posts