YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

గాలి కాలుష్యంపై సదస్సు

గాలి కాలుష్యంపై సదస్సు

గాలి కాలుష్యంపై సదస్సు
విజయవాడ,
గాలి కాలుష్యం పై ప్రజలకు అవగాహన కల్పించేదిశలో రాష్ట్రంలోనాల్గవ కార్యశాలను నిర్వహించడం  జరుగుతోందని ఏ.పి.సైన్స్ సిటి ప్రాజెక్టు కోఆర్డినేటర్ వి.సుమశ్రీ తాడేపల్లిలో శినివారం నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ విభాగం, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల భాగస్వామ్యంతో ఏ.పి.సైన్స్ సిటి ఆధ్వర్యంలో  డిసెంబర్ 14 నుండి 17 వరకు విద్యార్ధులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవగాహనా కార్యక్రమంలో  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మంది విద్యార్ధులు  భాగస్వామ్యం అవ్వడం జరుగుతోందన్నారు. అనంతరం డిసెంబర్ 18,19 తేదిలో 8లో జాతీయస్ధాయి సాంకేతిక సలహా కమిటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. గాలికాలుష్యం వలన ఎదుర్కుంటున్న ఇబ్బందులపై డిసెంబర్ 17 తేదీన సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మొదటి మూడు రోజులు 100 మంది విద్యార్ధులు భాగస్వామ్యం అవుతుండగా, 17వ తేదీ నిర్వహించే కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్ధులు, ప్రతినిధులు హాజరు అవుతారని సుమశ్రీ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు కార్యశాలలను, అవగాహనా కార్యక్రమాలను  తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం, అల్లవరం, అమలాపురం మండలాల్లో నిర్వహించామన్నారు. ఆప్రాంతాలలో నీటికాలుష్యాన్ని ప్రధానంగా గుర్తించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ వినియోగం, నీటికాలుష్యం వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు.  వ్వవపాయ ఆధారిద ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో నీటికాలుష్యం వలన వ్వవసాయకూలీలు తగ్గిపోతున్నారని తమ పరిశీలనలో గుర్తించామన్నారు. ఇందుకోసం నివారణ చర్యలు. తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కార్యశాలల్లో ప్రజలను చైతన్యపరచడం  జరిగిందన్నారు. విజయవాడ పి.బి.సిద్ధార్ధ కాలేజ్ ఆఫ్ ఆర్స్ అండ్ పైన్స్ మొగల్రాజపురంలో నిర్వహించే అవగాహనా కార్యక్రమం, కార్యశాలలను అధ్యయనం చేసిన అంశాల పై కూలంకషంగా, చర్చించి నివారణా చర్యలపై ఒక నివేదికను  రూపొందించడం  జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, భారత ప్రభుత్వ  ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. కోస్తా జిల్లా ప్రాతాల్లో ని మంచి నీటి నిల్వలు 60 శాతం ఉప్పునీరుగా మారుతుండడం తమ పరిశీలనలో తెలిసిందన్నారు.  ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించడం, స్నేహపూర్వక పర్యావరణ హితమైన వస్తువులను వినియోగించుకోవాలని  తద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఆమె తెలిపారు. 

Related Posts