హైదరాబాద్ లోని ఆదాయపు పన్నుల భవనం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఇన్కం టాక్స్ బిల్డింగ్ లోని ఎనిమిదవ అంతస్తులో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో వారు రెండు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ షర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు, ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.