YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ రామదూత ..... భూమాత

శ్రీ రామదూత ..... భూమాత

శ్రీ రామదూత ..... భూమాత
పంచభూతాల్లోను భూమి గొప్పది.  ఆకాశానికి శబ్దం ఒక్కటే గుణం .  వాయువు కు శబ్ధం, స్పర్శ ము రెండు గుణాలు వున్నాయి.  అగ్నికి శబ్దమూ, స్పర్శ ము,రూపమూ మూడూ వున్నాయి.నీటికి  శబ్దమూ, స్పర్శ మూ, రూపమూ,రసమూ అనే నాలుగు గుణాలు వున్నాయి. భూమికి మాత్రం  శబ్దము,  స్పర్శము,రసము,రూపము,గంధము అనే  అయిదు గుణాలు వున్నాయి. మేరువుకు దగ్గరగా ఒక పెద్ద జంబూ వృక్షము వుంది. దాని పేరు సుదర్శనం, దాని పొడవు రెండు వేల అయిదు వందల యోజనాలు. రసమున్న పెద్ద పెద్ద పళ్ళ తో ఎప్పుడూ కల కలలాడుతూ వుంటుంది.ఆ ఫలాలు నేలమీద పడి పగులుతూ వుంటాయి.  వాటిలోనుండి వచ్చిన  రసం నదీ ప్రవాహంలా  తయారయి మేరువుని ప్రదక్షిణం చేసి ఉత్తర కురుభూములనుంచి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. ఆ ప్రవాహమును జంబూనదీ అంటారు. జంబూనది జలం తాగిన మానవునికి వృధ్ధాప్యం, , అనారోగ్యం,  ఆకలి,  దాహం  అనేవే వుండవని అంటారు.  ఆ జంబూ వ్రృక్షం పేరే ఈ ద్వీపానికి వచ్చింది. సుదర్శన ద్వీపమని కూడా అంటారు. దీని చుట్టూ ఉప్పు సముద్రం వున్నది.  ఈ దీవి మీద తూర్పు పడమర్లకి నిడువుగా రెండు కొనలూ సముద్ర మును తాకుతూ హిమవంతమూ , హేమకూటమూ, నిషధమూ, నీలము,శ్వేతమూ,శృంగవంతము అని వరుసగా ఆరు పర్వతాలున్నాయి.ఆ పర్వతాలన్నీ మణి మాణిక్య, రత్నాల నిధులతో  అద్భుతంగా వుంటాయి. మునులు,  సిథ్థులు,సాధువులు, వీటి ని సేవిస్తూ వుంటారు. ఇటు మూడు అటు మూడు మథ్యన మేరు పర్వతముంటుంది.ఇది పద్మకోశము వలె వుంటుంది. స్వర్ణమయమై ,మణులతోను  అపురూపంగా, అపూ‌ర్వమై దివ్యంగా భాసిల్లుతూంటుంది. బ్రహ్మ,దేవేంద్రాది దేవతలంతా యిక్కడయజ్ఞయాగాలు నిర్వహిస్తూ సుఖ సంతోషాలను నుభవించేవారు.దాని ఉత్తర భాగం లో కొండగోగువనము వున్న ది. దానిలో పార్వతీ పరమేశ్వరులు  విహరిస్తూ వుంటారు. వారిని సిథ్థులు సేవిస్తూ వుంటారు. జంబూ ద్వీపము తొమ్మిది ఖండాలు.  భారత వర్షంలో ఉత్తరానికి వెళ్లిన కొద్దీ ప్రజలలో జవ సత్వాలు, ఆయురారోగ్యాలు హెచ్చుగా వుంటాయి..

Related Posts