బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
30 రోజుల వ్యవధిలో ఆయన ఉద్యోగంలో చేరాలని, భూ పరిపాలనా ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్‌ఏ)లో రిపోర్టు చేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మన్మోహన్‌సింగ్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వు(జీఓ 136)లో పేర్కొన్నారు.
నిరుడు 4 సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు.
గత ఏడాది జూన్26న ఇక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కిడాంబి సన్మానసభలో పాల్గొన్న సీఎం అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు తనను గ్రూప్-1 పోస్టులో నియమించాలని జూలై 30న శ్రీకాంత్ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాడు.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు అతడిని క్రీడల కోటాలో గ్రూప్-1 అధికారిగా నియమించేందుకు చట్టాన్ని సవరించింది.