YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భాగ్య నగరానికి భారీగా రోహింగ్యాలు...

భాగ్య నగరానికి భారీగా రోహింగ్యాలు...

భాగ్య నగరానికి భారీగా రోహింగ్యాలు...
హైద్రాబాద్, డిసెంబర్ 9
హైద్రాబాద్ సరికొత్త సమస్య తలెత్తింది.  రాష్ట్రంలో తాజాగా వలసల సమస్య తలెత్తింది. వలస వస్తున్నది పక్క రాష్ట్రాల నుంచి కాదు.. పొరుగు దేశం నుంచి కూడా కాదు. ఎంతో దూరాన ఉన్న మయన్మార్‌ నుంచి! వస్తున్నది రోహింగ్యా ముస్లింలు. తమకు ఎటువంటి సంబంధం లేని భాగ్యనగరానికి వారు అంత దూరం నుంచి ఎలా వస్తున్నారనేది ప్రధానమైన ప్రశ్న? ఏదో ఒక అదృశ్య హస్తం సహాయం లేనిదే ఇది సాధ్యం కాదని భారత ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే దీని నిగ్గు తేల్చాలని భావిస్తోంది.భాగ్యనగరానికి రోహింగ్యాలు  పోటెత్తున్నారు. హైద్రాబాద్ లో సుమారు 6 వేల మందిపైగా ఉన్నారని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఉన్నట్లు లెక్క తేల్చారు. మయన్మార్‌ లోని రఖైన్‌ రాష్ట్రం రోహింగ్యా ముస్లింల నివాసం. బౌద్ధులు అధికంగా ఉన్న మయన్మార్‌లో రోహింగ్యాలకు స్థానికులుగా గుర్తింపు లేదు. ఆ దేశ పౌరసత్వం లేదు. దీంతో వారిపై వివక్ష, హింస నిత్యకృత్యం అయ్యాయి. అత్యధికులు శరణార్థుల శిబిరాల్లో కాలం గడుపుతుంటారు. అడుగు బయట పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. ఈ కట్టడి భరించలేక కొందరు బంగ్లాదేశ్‌, మలేసియా, ఇండోనేసియా, భారత్‌ తదితర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు.రఖైన్‌ రాష్ట్రంలో ఎన్నో శతాబ్దాలుగా రోహింగ్యాలు నివసిస్తున్న దాఖలాలు ఉన్నాయి. వీరంతా బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారని మయన్మార్‌ ఆరోపిస్తోంది. అందుకే వారు తమ పౌరులు కారనేది ఆ దేశం వాదన. ఫలితంగా ఈ ప్రపంచంలో రోహింగ్యాలనే వారికి సొంత దేశమనేదే లేకుండాపోయింది.రోహింగ్యాల మూలాలు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉన్నాయి. మయన్మార్‌ 1824లో ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయటానికి కూలీలు అవసరమయ్యారు. దీంతో రోహింగ్యాలను చిట్టగాంగ్‌ నుంచి బర్మాకు తీసుకువచ్చారనే వాదన ఉంది.ఇలా వలస వచ్చిన వారికి, స్థానికులకు మధ్య మొదటి నుంచీ వివాదాలు ఉన్నాయి. ఆంగ్లేయుల పాలన ముగిసిన తర్వాత ఈ సమస్య ఇంకా పెరిగి పెద్దదైంది.1978లో ‘ఆపరేషన్‌ నాగా మిన్‌’లో వేలమంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో దాదాపు రెండు లక్షలమందికి పైగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించారని అంచనా.మయన్మార్‌లో 1982లో తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టం వారిని పౌరులుగా గుర్తించలేదు. ఫలితంగా దాదాపు 8 లక్షలమంది అనధికారికంగా ఆ దేశంలో నివసిస్తున్నట్లయింది. వారి ఆస్తులను ఇతరులు గుంజుకున్నారు.మూడేళ్ల క్రితం లో పేట్రేగిన హింసలో వారు పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది పునరావాస కేంద్రాల్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. మరికొందరు బతుకుతెరువును వెతుక్కుంటూ ఇరుగుపొరుగు దేశాలకు తరలివెళ్తున్నారు. అత్యధికులు సముద్ర మార్గంలో బంగ్లాదేశ్‌ చేరుకోగా, మరికొందరు అక్కడి నుంచి భారతదేశంలోకి అడుగుపెడుతున్నారు.ఈ సమస్య మరింత తీవ్రం కాక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా హైద్రాబాద్ లో పెరిగిపోతున్న రోహింగ్యాల సంఖ్యను అదుపు చేయటమే కాకుండా ఇప్పటికే అక్కడ ఉన్న వారిని వెనక్కి పంపించి వేయాలని ప్రయత్నాలు చేపట్టింది.దేశానికి  40,000 మంది రోహింగ్యా ముస్లింలు అక్రమంగా అడుగుపెట్టారని అనధికారిక అంచనా. వీరిలో 5,000 నుంచి 6 వేల మమంది ఒక్క హైద్రాబాద్ లోనే ఉండటం ఆందోళనకరమైన విషయం. వీరంతా మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌ను దాటుకొని భారత్‌లోకి ఎలా అడుగుపెడుతున్నారనేది ప్రశ్నార్థకం. ఎక్కువమంది సముద్ర మార్గంలో ముందుగా పశ్చిమబంగ చేరుకుంటున్నారు. మరికొందరు అక్కడి నుంచి నేపాల్‌ మీదగా కశ్మీర్‌లోకి వస్తున్నారని నిఘా వర్గాల అంచనా. కొందరు ఇక్కడ చిన్నచిన్న నేరాలకు కూడా పాల్పడుతున్నారు. ఇటువంటి వారిని పొరుగుదేశం ఉపయోగించుకొని ఉగ్రవాద చర్యలకు ఆజ్యం పోయవచ్చని ప్రభుత్వవర్గాలు అనుమానిస్తున్నాయి.

Related Posts