Highlights
- విద్యుత్తు లోకోలతో రైళ్లకు పచ్చ జెండా
- ఇక గుంటూరు - బెంగళూరుకు
- తొలి ప్రయత్నం బందరు నుంచి యశ్వంత్పూర్ శ్రీకారం
- త్వరలో సూపర్ ఫాస్టు రైళ్ళు
గుంటూరు నుంచి బెంగళూరు వరకు విద్యుత్తు లోకోలతో రైళ్లను నడిపేందుకు మార్గం సుగమమైంది. తొలిసారి మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలును బుధవారం విద్యుత్తు లోకోతో నడిపారు. ఈ రైలును విజయవాడ వరకు డీజిల్తో... అక్కడి నుంచి విద్యుత్తు లోకోతో ప్రారంభించారు. త్వరలో గుంటూరు మీదుగా బెంగళూరుకు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా రానున్నాయి. సరకుల రైళ్ల వేగం పెరగడంతో పాటు రాకపోకలు అధికమవుతాయి. గుంటూరు- గుంతకల్ మార్గంలో విద్యుదీకరణ పూర్తయినందున బుధవారం నుంచి విద్యుత్తు లోకోలతో రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇక నుంచి విద్యుత్తు లోకోలతో మచిలీపట్నం-యశ్వంత్పూర్-మచిలీపట్నం, హౌరా-సత్యసాయిప్రశాంత నిలయం-హౌరా, పూరి-యశ్వంత్పూర్-పూరి ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు.