తిరుమలలో వరుస అగ్ని ప్రమాదాలు
తిరుమల డిసెంబర్ 09, :
తిరుమల శ్రీవారి బూందీ పోటులో వరుస అగ్ని ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం టిటిడి తీసుకోవడం లేదు. శ్రీవారి ఆలయంలో టిటిడి నిభందనలకు విరుద్ధంగా అధికారులు.. పాలకమండలి కమిటీ తప్పిదాలు చేస్తున్నారని భక్తులు అంటున్న విషయంలో వాస్తవ పరిస్థితి ఎంత వరకు ఉంది. బూంధీ పోటు ప్రమాదాలతో ఒక్కసారిగా భక్తులలో అగ్రహారం కట్టలు తెంచుకోవడానికి కారణం ఏంది. అస్సలు తిరుమల కొండపై వరుస వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రం కు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. నిత్యం 70 వేల మంది.... వీకెండ్ రోజుల్లో 90 వేల వరకు భక్తులు శ్రీవారి ని దర్శిస్తారు. అయితే తిరుమల వేదికగా ఇపుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆలయం ప్రక్కనే ఉన్న లడ్డు భూంధీ తయారీ పోటులో సంవత్సరంలో కనీసం రెండు మూడు సార్లైనా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరక్కపోయినా.. లడ్డు భూంధీ తయారీ చేసేసిబ్బందికి గాయాలతో బయట పడుతున్నారు. అక్కడ సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... బూందీ పోటులో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
సరే బూంధీ పోటు కథ అలా ఉంచితే, . శ్రీవారి ఆలయం వేదికగాను గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆలయం ప్రక్కన లడ్డుల కోసం బూంధీ తయారుచెసిన తరువాత మళ్లి ఆ భూంధీని ఆలయం కి పంపుతారు. అక్కడ ప్రత్యేకంగా సిబ్బంది సాంప్రదాయం ప్రకారం లడ్డులహ తయారు చేస్తారు. కాని అదే సమయంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అస్సలే ఆలయం లోపల చాలా ఇరుకు గా నిత్యం భక్తుల రద్దీ, అధికారుల హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో లడ్డు తయారీ కేంద్రం లోనూ ప్రమాదాలు జరిగినప్పుడు అందరూ బయటకు పరుగులు తీస్తుంటారు. అలాంటి సమయంలో కూడా భక్తులు తీవ్రంగా స్పందిస్తారు. నిర్లక్ష్యం గా అదికారులు వ్యవహారాల వల్లనే ఈ ప్రమాదాలు అని అంటున్నారు. అయితే ఒకవైపు ఆలయలోపల గతంలో లడ్డుతయారీ కేంద్రంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా, తాజా గా ఆలయం ప్రక్కనే ఉన్న బూంధీ పోటులో అగ్ని ప్రమాదాలు జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్థున్నది.భక్తులు మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అగ్రహించాడని, టిటిడి అధికారుల తప్పిదాలతో స్వామి వారికి కోపం వచ్చిందని, అందుకే ఒకహెచ్చరిక ఇవ్వడానికే అప్పుడప్పుడూ ఇలాంటివి జరిగుతున్నాయని అంటున్నారు. భక్తులు అంటున్నట్టు టిటిడి ఈ మద్యకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం.. కొన్ని అమలు చేయడం.. మరి కొన్నింటిని విమర్శలు రావడంతో నిలిపివేయం చేశారు. ఇందులో ప్రదానంగా స్వామి వారి ఆలయం లో వైకుంఠ ద్వారాలు పదిరోజులు తీస్తారని ప్రచారం వచ్చింది. శ్రీవారి నిత్యసేవలు కొన్ని రద్దు చేస్తారని వార్తలు వచ్చాయ్. దోంతో వెంకన్న ఆగ్రహం చెందినట్టు భక్తులు బహిరంగంగా టిటిడిపై కయ్యానికి దిగారు. అందుకే ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు అంటున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారం సమీపం నుంచి బూందీ పోటును వెంటనే ప్రాంతానికి తరలించాలని భక్తులు అంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రాకారం చుట్టూ బూంది తయారీకి ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్ లైన్లను తొలగించి కరెంటు పొయ్యల ద్వారా కానీ స్టీమ్ బాయిలర్ ద్వారా బూందీ తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాలని అంటున్నారు. బూందీ పోటులో జరిగే వరుస అగ్ని ప్రమాదాల కారణంగా ఆ వేడికి కి భవిష్యత్తులో శ్రీవారి ఆలయ ప్రాకారంతో పాటు ఆనంద నిలయం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిక చేస్తున్నారు మరి కొందరు భక్తులు. మిరాశీ వ్యవస్థ సాంప్రదాయంగా కట్టు బొట్టు జుట్టు చూసి లడ్డు తయారీ కి అనుమతించేవారు. కానీ నేడు అనుభవం లేని కొంతమంది పోటు కార్మికుల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి మరికొందరి వాదన. శ్రీవారి బూందీ తయారీ పోటులో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోటు కార్మికులకు నెలలో ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించాలని, శ్రీవారి బూంది తయారీ పోటులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. శ్రీవారి బూంది తయారీ పోటు సమీపంలో అత్యాధునిక పరిజ్ఞానంతో ఫైరింజన్లు ఏర్పాటు చేయాలని. . అనుభవం కలిగిన ఫైర్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.