పీపీఏలపై సమీక్ష
అమరావతి డిసెంబర్ 09, :
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్గారు సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లడుతూ పవన, సౌర విద్యుత్ పర్యావరణ పరిరరక్షణ దష్ట్యా మంచివే. కానీ అవి ఇప్పుడు ఎంతో వ్యయంతో కూడుకున్నాయి. మిగతా దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏ ఏడాది ఏ రంగం నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాలి అన్నదానిపై స్పష్టత ఉంది. కానీ గత ప్రభుత్వం నిర్ణీత శాతానికి మించి 41 శాతం అధికోత్పత్తికి హడావిడిగా ఒప్పందం చేసుకున్నారు. 2017, మార్చికి కాలపరిమితి అయిందని చెప్పి కేవలం 15 రోజుల్లో 41 పీపీఏలు చేసుకున్నారు. కేవలం 15 రోజుల్లో పవన విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, ఉత్పత్తి సాధ్యమా? నిజానికి అందుకు కనీసం ఏడాదిన్నర పడుతుందని అన్నారు. రెన్యువబుట్ ఎనర్జీ ఒక్కో యూనిట్ దాదాపు రూ.4.84 పడుతుంది. అదే సమయంలో థర్మల్ విద్యుత్ దాదాపు రూ.3 పడుతుంది. అంటే దాదాపు రెండు రూపాయలు తేడా. ఈ నేపథ్యంలో రెన్యువబుల్ పవర్ (సౌర, పవన విద్యుత్)ను తీసుకోలేమని డిస్కమ్లు స్పష్టం చేశాయి. ఇక థర్మల్ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అంటే విద్యుత్ వాడుకోకపోయిఆన ఒక్కో యూనిట్కు రూ.1.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల సౌర, పవన విద్యుత్ వినియోగానికి వెళ్తే, అక్కడ ఒక్కో యూనిట్కు దాదాపు రూ.2 ఎక్కువ చెల్లించాల్సి రావడం, మరోవైపు థర్మల్ విద్యుత్ వినియోగించుకోనందుకు ఫిక్స్డ్ ఛార్జీ కింద ఒక్కో యూనిట్కు రూ.1.50పైన చెల్లించాల్సి ఉంటుంది. అంటే దీని వల్ల ఒక్కో యూనిట్ విద్యుత్ను దాదాపు రెట్టింపు ధరకు కొనుగోలు చేసినట్లు అవుతుంది. వీటన్నింటి నేపథ్యంలోనే పీపీఏల సమీక్షకు ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి గత ప్రభుత్వం డిస్కమ్లకు కూడా పెద్ద ఎత్తున బకాయి పడింది. అదే విధంగా 2014–15లో డిస్కమ్ల నష్టాలు రూ.9 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి అవి ఏకంగా రూ.29 వేల కోట్లకు చేరాయని అన్నారు. అంటే 5 ఏళ్లలో డిస్కమ్ల నష్టాలు రూ.20 వేల కోట్ల నష్టాలు పెంచారు. కేంద్రం రాసిన లేఖలో స్పష్టంగా ఉంది. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే చర్య తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కూడా పెద్ద ఎత్తున బకాయి పడింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం 2014–15లో రూ.3910 కోట్లు బకాయి పడగా, ఆ మొత్తం 2018–19 నాటికి ఏకంగా రూ.21,540 కోట్లకు పెరిగాయి. వాటన్నింటినీ చెల్లిస్తూ వస్తున్నాం. అందుకే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష చేపడుతున్నామని అయన వెల్లడించారు.