YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కర్ణాటక ఉపఎన్నికలు, కాంగ్రెస్ నేతల రాజీనామా

 కర్ణాటక ఉపఎన్నికలు, కాంగ్రెస్ నేతల రాజీనామా

 కర్ణాటక ఉపఎన్నికలు, కాంగ్రెస్ నేతల రాజీనామా
బెంగళూర్, డిసెంబర్ 9, 
కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించగా.. 12 చోట్ల బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా.. జేడీఎస్ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. జేడీఎస్ మద్దతుతో ఓ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఉపఎన్నికల్లో విజయంతో.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మ్యాజిక్ మార్క్‌ను దాటేసింది.సీఎం యడియూరప్ప సొంత జిల్లా మండ్యలో బీజేపీ తొలిసారి అసెంబ్లీ సీటును గెలుపొందడం గమనార్హం. ఒక్కలిగ సామాజిక వర్గానికి కంచుకోట లాంటి మండ్య జిల్లాలో బీజేపీ గెలవడాన్ని బట్టి కమలం పార్టీ ఏ రేంజ్‌లో సత్తా చాటిందో అర్థం చేసుకోవచ్చు.ఎన్నికల్లో చిత్తుగా ఓడటంతో.. సీఎల్పీ లీడర్ పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి కూడా సిద్ధూ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ.. సీఎల్పీ పదవికి రాజీనామా చేస్తున్నానని సిద్ధూ తెలిపారు. రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపానన్నారు.కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు గత వారం ఉప ఎన్నికలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 15 స్థానాల్లో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మూడు చోట్ల జేడీఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కానీ ప్రస్తుత ఉపఎన్నికల్లో హునసూరు, శివాజీనగరలో మాత్రమే హస్తం పార్టీ విజయం సాధించింది. 12 చోట్ల పోటీ చేసిన జేడీఎస్ ఒక్క సీటును కూడా సొంతం చేసుకోలేకపోయింది.ఉపఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దినేశ్ గుండూరావ్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికల పూర్తి బాధ్యత నాపై ఉంచారన్న దినేశ్.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేస్తున్నానన్నారు. రాజీనామా పత్రాన్ని సోనియా గాంధీకి అందజేస్తానని తెలిపారు.

Related Posts