ఏసీబీ వలలో కర్నూలు సబ్ రిజిస్ట్రార్
కర్నూలు డిసెంబర్ 9,
కర్నూలు నగరంలోని రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న మహబూబ్ అలీనీ సోమవారం కర్నూలు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హిమాలయ కంపేనీ ఔషధ సంస్థకు సంబంధించిన లీజు డీడ్ ఒప్పందం యొక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుకూలంగా ఉంది, ఇందుకోసం ఫిర్యాదుదారుడు కర్నూలులో ఫ్రాంచైజ్ షాపును నిర్వహిస్తున్నాడు. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నిమిత్తం నిమిత్తం ఎస్సార్వో పట్టిక నుండి అధికారిక పత్రాలు సమర్పించినప్పటికీ వాటిని క్రమబద్ధం చే క్రమంలో కర్నూలు సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ అలీ రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు. షేక్ సమీర్ బాషా అనే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఫిర్యాదుదారు పి.జగన్ మోహన్ రెడ్డి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్సార్వో పట్టిక నుండి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.