YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అడుగులు మడుగులొత్తే పోలీసుల బుద్ధి మారే అవకాశమే లేదా?

అడుగులు మడుగులొత్తే పోలీసుల బుద్ధి మారే అవకాశమే లేదా?

అడుగులు మడుగులొత్తే పోలీసుల బుద్ధి మారే అవకాశమే లేదా?
హైదరాబాద్ డిసెంబర్ 9  
ఏటీవల చోటు  చేసుకున్న సంఘటనల నేపద్యంలో పోలీసుల తీరు మారుతుందని అందరూ ఆశించారు. కానీ అధికారంలో ఉన్నవారికి అడుగులు మడుగులొత్తే బుద్ధి మారే అవకాశమే లేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు చెందిన ఒక మహిళా అధికారికి ఆలేరు లో బాల్య వివాహం జరుగుతున్నట్లు ఫిర్యాదు వచ్చింది.ఆ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు ఆ అధికారి వచ్చారు. బాల్య వివాహం ఫిర్యాదుపై ఆమె విచారణ జరుపుతుండగా ముస్తఫా అనే ఒక వ్యక్తి అక్కడకు వచ్చాడు. వివాహం జరిపేవారి బంధువా అని ఆమె అడిగారు. ఏదేదో మాట్లాడుతుంటే అతన్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆమె కోరారు.అయితే అతను వెళ్లకపోగా అతను అక్కడ నుంచే ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త కు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఎమ్మెల్యే భర్త  మహేందర్ రెడ్డి అధికారికి ఫోన్ చేశాడు. బెదిరించాడు. అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. తన విధి తాను నిర్వర్తిస్తున్నానని, ఫిర్యాదుపై పూర్తి విచారణ జరపకుండా తాను వెళ్లేది లేదని అమె సమాధానం ఇచ్చారు.అధికారి సమాధానం వినకుండా ఎమ్మెల్యే భర్త ఆమెను బెదిరిస్తూనే పోయాడు. దాంతో ఆమె ఆలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భర్త తనను బెదిరించాడని ఆమె చేసిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదు. ఎస్ ఐ లేడు, సిఐ లేడు అంటూ కాలయాపన చేశారు తప్ప ఆలేరు పోలీసులు ఆమె ఫిర్యాదుపై స్పందించలేదు. జీరో ఎఫ్ ఐ ఆర్ అదీ ఇదీ అంటారు తప్ప పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ అధికారి వాపోయారు. ఎమ్మెల్యే భర్త కావడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించడం లేదని సూర్య కళ అనే ఆ ఐసీడీఎస్ అధికారి  కన్నీటి పర్యంతమయ్యారు. మహేందర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts