YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

హైకోర్టులో గొడవకు దారితీసిన దిశ ఎన్ కౌంటర్ 

హైకోర్టులో గొడవకు దారితీసిన దిశ ఎన్ కౌంటర్ 

హైకోర్టులో గొడవకు దారితీసిన దిశ ఎన్ కౌంటర్ 
హైదరాబాద్ డిసెంబర్ 9  
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా ఓ వైపు అనుకూలత.. మరో వైపు ప్రతికూలతల నడుమ ఈ కేసు హైకోర్టుకెక్కింది.అయితే తాజాగా దిశ ఎన్ కౌంటర్ హైకోర్టులో గొడవకు దారితీసింది. ఈ ఎన్ కౌంటర్ పై మహిళా సంఘాలు హైకోర్టుకెక్కాయి. ఈరోజు హైకోర్టు ప్రాంగణంలో మహిళా సంఘాల తరుఫు లాయర్లు - మరో వర్గం లాయర్ల మధ్య గొడవ పతాక స్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఫేక్ ఎన్ కౌంటర్ కాదంటూ మహిళా సంఘాల తరుఫు లాయర్లను మరో వర్గం లాయర్లు నిలదీశారు. అయితే ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ మహిళా సంఘాల తరుఫున లాయర్లు బల్ల గుద్ది వాదించారు.హైకోర్టు జడ్జీలు జోక్యం చేసుకొని సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హైకోర్టు ప్రాంగణంలో అలజడి సద్దుమణిగింది.

Related Posts