YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

మానవహక్కుల అణచివేతను ప్రశ్నించే నిరసన గళాలను ఉక్కుపాదంతో తొక్కిపడేసే నిరంకుశ వైఖరి చైనాలో

మానవహక్కుల అణచివేతను ప్రశ్నించే నిరసన గళాలను ఉక్కుపాదంతో తొక్కిపడేసే నిరంకుశ వైఖరి చైనాలో

మానవహక్కుల అణచివేతను ప్రశ్నించే నిరసన గళాలను ఉక్కుపాదంతో తొక్కిపడేసే నిరంకుశ వైఖరి చైనాలో అడుగడుగునా కనిపిస్తుంది.

ఉయ్‌గుర్ ముస్లింలు, టిబెట్ బౌద్ధులు, హౌస్ క్రిస్టియన్లు.. వీరందరినీ చైనా ఉక్కు పాదంతో అణిచేస్తోంది. ఈ విషయంలో చైనా వైఖరిని ఇప్పటికే అనేక దేశాలు నిరసించాయి. మానవహక్కుల దినోత్సవం సందర్భంగా చైనా అణచివేత ధోరణికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.చైనా ప్రభుత్వ అరాచకానికి బలైనవారిలో ఫాలూన్ గాంగ్‌ను అనుసరించే వారిది అత్యంత దీనమైన గాధ. ఫాలూన్ గాంగ్ అంటే.. బౌద్ధ, టౌ ఆధ్యాత్మిక విధానాల కలబోత. ఫాలూన్ గాంగ్ అనుసరించే వారికి అహింసే పరమధర్మం. లీ హంగ్జీ అనే చైనా డాక్టరు ఈ ఆధ్యాత్మిక విధానానికి ఆద్యుడు. శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. 1992లో ప్రారంభమైన ఈ విధానానికి అనేక వేల మంది చైనీయులు ఆకర్షితులయ్యారు. ఫాలూన్ గాంగ్ విధానాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. కానీ..చైనా ప్రభుత్వానికి ఇది రుచించలేదు. తన ఆధిపత్యానికి ఫాలూన్ గాంగ్‌ ఆధ్యాత్మిక విధానం నుంచి ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం బలంగా నమ్మింది. దీంతో ఈ విధానాన్ని అనుసరించే వారిని జైళ్లలో బంధించింది. వారిపై జైళ్లలో మరిన్ని దారుణాలకు తెగబడింది. వారి నుంచి బలవంతంగా అవయవాలను సేకరించింది. అవసరమైన వారికి సరఫరా చేసింది.ఈ క్రమంలో అవయవ మార్పిడి ఆపరేషన్లలో చైనా మిగతా దేశాలను దాటి ముందుకెళ్లిపోయింది. అవయవాలు లభ్యం కాక ఇతర దేశాలు అవస్థలు పడుతుంటే చైనాలో మాత్రం ఇటువంటి ఆపరేషన్లు వేల సంఖ్యలో జరిగాయి. ప్రభుత్వ ఆదేశాలతో అక్కడి డాక్టర్లు.. జైళ్లలో మగ్గుతున్న వారి అవయవాలు తొలగించేశారు. అయితే చాలా కాలం పాటు ఈ విషయం ప్రపంచ దేశాలకి తెలియదు. దీంతో ఇజ్రాయెల్, జపాన్ దేశాలకు చెందిన రోగులు చైనాకు పోటెత్తారు. ఈలోపు.. డాఫో( డాక్టర్స్ అగెయినెస్ట్ ఫోర్స్‌డ్ ఆర్గాన్ హర్వెస్టింగ్) వంటి స్వచ్ఛంద సంస్థలు ఈ దారుణాలని వెలుగులోకి తేవడంతో ప్రపంచం నివ్వెరపోయింది. తమ దేశస్థులు అవయవ మార్పిడి ఆపరేషన్ల కోసం చైనా వెళ్లకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌, జపాన్ వంటి దేశాలు అనేక చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.ఇక.. ఫాలూన్ గాంగ్ దారుణాలను బయటపెట్టిన ఢాఫో వ్యవస్థాపకుడు డా. టార్సస్టన్ ట్రేను ముంబైలోని హార్మని ఫౌండేషన్ మదర్ థెరిసా మెమోరియల్ అవార్డ్‌-2019తో సంత్కరించింది. మానవహక్కుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే భారత్.. చైనా ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేయాలి. ప్రభుత్వం దారుణాల నుంచి అక్కడి మైనారిటీలను రక్షించాలి

Related Posts