YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 48 రాకెట్‌ ప్రయోగం తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు

బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 48 రాకెట్‌ ప్రయోగం తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు

బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 48 రాకెట్‌ ప్రయోగం
తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు
నెల్లూరు డిసెంబర్ 10 
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని   సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శ్రీహరికోట నుంచి ఈ నెల 11న పిఎస్‌ఎల్‌వి-సి 48 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి కౌంట్‌ మంగళవారం మధ్యాహ్నం 4.25 గంటలకు ప్రారంభం అయింది. ఇది నిరంతరంగా 23 గంటలు కొన సాగనుంది. అనంతరం బుధవారం మధ్యాహ్నం 3.25 గంట లకు రాకెట్‌ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్‌ ద్వారా భారత్‌కు చెందిన ఆర్‌ఐఎస్‌ఎటి-2బి ఆర్‌ఐ1 ఉపగ్రహంతోపాటు మరో తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను యోగించనున్నారు.  నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఎఎస్‌ఎకు చెందిన ఆరు ఉన్నాయి.  రెండు వారాల స్వల్ప వ్యవధిలో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇది పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ల సీరీస్‌లో 50వ ప్రయోగం. ఈ ఏడాది షార్‌ నుంచి ఆది ఆరో ప్రయోగమని శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం.మరోవైపు, తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనసమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్వీసీ-48 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేపు పీఎస్‌ఎల్వీ సీ 48 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశామని, ఆర్‌ఏశాట్‌2, బీఆర్‌ 1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలిపారు.ఇస్రోకు ఇదో చారిత్రక ప్రయోగం కాబోతోందని, పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం కాగా.. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగమని తెలిపారు.

Related Posts