YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నిరసన

టీడీపీ నిరసన

టీడీపీ నిరసన
అమరావతి డిసెంబర్ 10, 
అసెంబ్లీసమావేశాలు రెండో రోజులో భాగంగా  ఫైర్ స్టేషన్ వద్ద  టీడీపీ నేతలు నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలయని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసారు. తరువాత ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. ఈ ర్యాలీలో చంద్రబాబు,  లోకేశ్ కుడా పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ అమ్మబోతే అడవి కొనబోతే కొరవి లా రైతుల పరిస్థితి ఉంది. రైతు పంట కొనే నాథులు లేరు. దిగుబడి తగ్గినా ఎవ్వరు కొనటం లేదు. వేరుశనగ, పామాయిల్, శనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనని అన్నారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆరు నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేవరకు పోరాటం  కొనసాగుతుంది. రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. 

Related Posts