సమత కుటుంబాన్ని పరామర్శించిన డీకే ఆరుణ
నిర్మల్ డిసెంబర్ 10,
గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లా,లింగాపూర్ మండలం, ఎల్లాపాటర్ గ్రామంలో బుగ్గలు అమ్ముకుంటున్న సమత ను అతి కిరాతంగా హత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని చేసిన బెజెపి నాయకురాలు డి.కె అరుణ డిమాండ్ చేసారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం, గోసంపల్లి గ్రామనికి చెందిన సమత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారం చేసుకొని జీవించే తమ కుటుంబం లో సమత మృతి చెందడం పిల్లలు తట్టుకోలేక పోతున్నారని మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటన లో నిందితులను శిక్షించినట్లే సమత ఘటనకు చెందిన నిందితులను శిక్షించాలని డి.కె అరుణ కు వివరించారు.
డి.కె అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా చట్టంలో మార్పులు తెచ్చేదిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. దనార్జన కొరకు హైవేలపై తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపులను విచ్చల విడిగా ఏర్పాటు చేసిందని అన్నారు. దీని కారణంగానే అనేక నేరాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణమైన ఆత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. భాదితుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దిశ నిందితులకు పడిన శిక్షలనే సమత నిందితులకు కూడా వేయాలని ఆమె డిమాండ్ చేశారు.