YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

మనోవికాస కేంద్రంలో మంత్రి పర్యటన

మనోవికాస కేంద్రంలో మంత్రి పర్యటన

మనోవికాస కేంద్రంలో మంత్రి పర్యటన
వరంగల్ డిసెంబర్ 10, 
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ప్రపంచ మానసిక దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా వాటర్ ఫాల్స్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కుడా పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల తల్లిదండ్రులు అధైర్య పడవద్దని అన్నారు. మల్లికాంబ మనోవికాస కేంద్రం నుండి నాకు 18సంవత్సరాల పరిచయం ఉంది. నేను వీరికి  భూమి ఇప్పించేందుకు కృషి చేసానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మానసిక దివ్యాంగుల  కొరకు 3016 రూపాయల పింఛన్ అందిస్తుంది. ఈ పించన్ల  కొరకు రూ 942 కోట్లు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల పింఛన్ ఇస్తుందని అన్నారు.  దివ్యాంగుల కొరకు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తాను.  పింఛన్ రానివారికి ఇక్కడే ఇప్పించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. గతంలో 8 కేటగిరి లో పింఛన్ వచ్చేది. ఇప్పుడు 21కేటగిరి ల వారికి పింఛన్ ఇస్తున్నాము. మల్లికాంబ మనోవికస కేంద్రానికి కు నా  వంతు సహాయం చేస్తానని అన్నారు.

Related Posts