ఎన్ హెచ్ ఆర్సీ కి నివేదిక ఇచ్చిన పోలీసులు
హైదరాబాద్ డిసెంబర్ 10,
వెటర్నరీ వైద్యురాలు దిశ ఆత్యాచారం, హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి సైబరాబాద్ పోలీసులు నివేదిక అందించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేత వివరాలను నివేదికలో తెలిపారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను ఎన్హెచ్చ్ఆర్సీకి అందజేసిన నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. దిశ ఫై రేప్ జరిగినట్టు , హత్య నిందితులే చేసినట్టు సాక్ష్యాలు ఇచ్చారు. ఫోరెన్సిక్ ఆధారాలతో ఎన్హెచ్ఆర్సీకి నివేదిక ఇచ్చారు. సంఘటన స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను నీవేదిక ముందు పెట్టారు. ఘటనా స్థలం తో పాటుగా లారీ తిరిగిన సీసీ ఫుటేజీని కుడా ఇచ్చారు. దాంతో పాటు కొత్తూరు సమీపంలో పెట్రోల్ కొనుగోలు చేసిన నిందితులు సీసీ ఫుటేజీని ఇచ్చారు.