YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నవశకం డాటా సేకరణపై సమీక్ష

నవశకం డాటా సేకరణపై సమీక్ష

నవశకం డాటా సేకరణపై సమీక్ష
ఏలూరు, డిసెంబర్ 10
వై.ఎస్.ఆర్ నవశకం కార్యక్రమం క్రింద బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ, విద్యాదీవన కార్డుల పంపిణీ కొరకు లబ్దిదారుల డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తమ ఛాంబరులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి నవశకం డేటా ఎంట్రీ, సెక్రటేరియట్ పోస్ట్ ల భర్తీ అంశాలపై సమీక్షించి ఆదేశాలు జార చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవశకం కార్యక్రమం క్రింద పంపిణీ చేయనున్న కార్డులు, సంక్షేమాలకు సంబంధించి లబ్దిదారుల డేటా ఎంట్రి ప్రక్రియను వెంటనే పూర్తిచేసి జాబితాలను సిద్దం చేయాలని ఆదేశించారు. సదరు జాబితాలను ఈ నెల నిర్వహించే 20న గ్రామ సభలలో ప్రకటించి ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించాలని, వాటిని పరిష్కరించిన అనంతరం తుదు జాబితాలను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు.  అలాగే కాపు నేస్తం, దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, అర్చకులకు ఆర్థిక సహాయాల పంపిణీ పధకాల లబ్దిదారుల సర్వే కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేసి జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. లబ్దిదారులకు అవసరమైన కుల దృవీకరణ పత్రాల జారీ, షాపుల రిజిష్ట్రేషన్ జాప్యం లేకుండా నిర్వహించి అర్హులు అందరూ లబ్దిపొందేలా చూడాలన్నారు.  జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు చేయనున్న  భవనాలన్నిటిలో  విద్యుదీకరణ, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించి, కంప్యూటర్లు, ఇతర హార్డు వేర్ పరికారాలను నెలకొల్పాలని ఆదేశించారు. కార్యదర్శుల పోస్ట్ లకు నియామక ఉత్తర్వులు జారీ చేసిన వారందరూ వెంటనే సచివాలయాలలో జాయిన్ అయ్యేట్లు చూడాలని, అందరికీ వారు నిర్వహించ వలసిన విధులు, బాధ్యలపై సమగ్ర శిక్షణ కల్పించాలని కోరారు. వివిధ కేటగిరిలలో  స్పోర్ట్స్ కోటాగా రిజర్వు అయిన పోస్ట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల జాబితాలను నిబంధనల ప్రకారం రాంకింగ్ నిర్ణయించి క్రోడీకరించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యం.వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్-2 ఎన్. తేజ్ భరత్, జడ్పి సిఈఓ యం.వెంకటరమణ, డిపిఓ టి.శ్రీనివాస విశ్వనాధ్, ఏలూరు మున్సిపల్ కమీషనర్ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.    

Related Posts