మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ ఆత్యాచారం
చిత్తూరు డిసెంబర్ 10
చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. తిరుచానూరులో పదహారేళ్ల బాలికపై అత్యాచారం ఘటన వెలుగు చూసిన ఒక రోజు వ్యవధిలోనే వీకోట మండలం లో పన్నెండేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు.
ఏపీ అసెంబ్లీ లో ఆడవాళ్లపై జరిగే అధికారులపై కఠిన చట్టాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న మృగాళ్ల లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో రెండు అత్యాచార ఘటన లో వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. అదికూడా మైనర్ బాలికలపై జరగడం గమనార్హం తిరుచానూరులో పదహారేళ్ల మైనర్ బాలికను ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిన మరుసటిరోజే వీకోట మండలం లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెద్ద బర్నే పల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామం సమీపంలోని ఓ ప్రైవేటు డైరీలో బాలిక పని చేస్తోంది. రోజులాగే పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో అక్కడ కనపడిన ఆటో ఎక్కింది. ఆటోడ్రైవర్ రాధాకృష్ణ ఆటోను దారి మళ్ళించి సమీపంలోని ఓ మామిడి తోట లోకి తీసుకోయాడు. ఆటో నిలిపి నిర్జన ప్రదేశంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. అతికష్టం మీద ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయం పాల కేంద్రం వద్ద కి చేరుకున్న తల్లిదండ్రులు అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ ను గుర్తించి నిలదీశారు. ఆటోడ్రైవర్ రాధాకృష్ణ సమాధానం చెప్పకపోగా బాధితురాలి తండ్రి పై ఎదురు దాడికి దిగాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు నక్కల పల్లి కి చెందిన నిందితుడు ఆటో డ్రైవర్ రాధాకృష్ణ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు . నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాలిక తల్లిదండ్రులు.