YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

గడ్డిఅన్నారంలో ఇన్సెంటీవ్ క్లీన్లీనెస్ డ్రైవ్ను ప్రారంభించిన మేయర్ 

గడ్డిఅన్నారంలో ఇన్సెంటీవ్ క్లీన్లీనెస్ డ్రైవ్ను ప్రారంభించిన మేయర్ 

గడ్డిఅన్నారంలో ఇన్సెంటీవ్ క్లీన్లీనెస్ డ్రైవ్ను ప్రారంభించిన మేయర్ 
స్వచ్ఛ హైదరాబాద్ గా తీర్చిదిద్దుటలో ప్రజలు భాగస్వాములు కావాలి
హైదరాబాద్ డిసెంబర్ 10  
గడ్డిఅన్నారం వార్డు -23 లోని  దిల్సుఖ్ నగర్ లో ఇంటెన్సివ్ క్లీన్లీ నెస్ డ్రైవ్ ను  నగర మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం ప్రారంభించారు. ఇండ్లు, షాపులు, వ్యాపార సంస్థలతో  పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోటి జనాభా ఉన్న నగరంలో 20 వేలమంది  పారిశుధ్య కార్మికులు, సిబ్బంది మాత్రమే వున్నారని, స్వచ్ఛ హైదరాబాద్ గా తీర్చిదిద్దుటలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్లపై చెత్త, వ్యర్థాలను వేసే వారిని గుర్తించి, జరిమానాలు విధించుటకు సిసి కెమెరాలను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలకు నెలకు రూ 50-100 లను స్వచ్చందంగా ఇవ్వాలని సూచించారు. దేశంలోని అన్ని చోట్ల ఈ పద్దతి ఉన్నది. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యాన్ని సాధించుటకు రూపొందించిన 100 అంశాల అమలుకు ఇన్సెంటీవ్ క్లీన్లీనెస్ డ్రైవ్ ను చేపట్టినట్లు వివరించారు.  ప్రతి వార్డులో 4రోజుల పాటు డివిజన్ లోని మెజారిటీ సిబ్బందిని సమీకరించి, ఈ పనులను పూర్తి చేయనున్నారు. మహిళా స్వయంసహాయక సంఘాలను, శానిటేషన్,  ఎంటమాలజి విభాగాలు డ్రైవ్ లో పాల్గొంటాయి.  ప్రతి జోన్ లో వార్డుల వారీగా పై విభాగాలను భాగస్వాములను చేస్తూ,  ఇన్సెంటీవ్ క్లీన్లీనెస్ డ్రైవ్ ను అమలు చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ డ్రైవ్లో ప్రజలకు హెల్త్ అవేర్నెస్  కల్పించనున్నట్లు తెలిపారు. మలేరియా, డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణంలో గడ్డిఅన్నారం ను మోడల్గా రూపొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డులోని 112 ఎస్.ఎస్.జి గ్రూపులు, ఎన్.జి.వోలు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమన్యాలు, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంటమాలజీ,  శానిటేషన్ సిబ్బంది తో కలిసి దోమల నిర్మూలన స్ప్రేయింగ్, రోడ్ల శుభ్రత-స్వీపింగ్,ఫ్లెక్సీస్ తొలగింపు పనులలో పాల్గొన్నారు.  ఇండ్లు, షాపులు, వ్యాపార సంస్థలతో  పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోటి జనాభా వున్న నగరంలో 20 వేలమంది  పారిశుధ్య కార్మికులు, సిబ్బంది మాత్రమే వున్నారని, స్వచ్ఛ హైదరాబాద్ గా తీర్చిదిద్దుటలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్, జి. విఠల్ రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి, సాగర్ రెడ్డి, రాధా ధీరజ్ రెడ్డి, సంగీత ప్రశాంత్ గౌడ్, అనలా రెడ్డి, శానిటేషన్ స్పెషల్ కమీషనర్ సుజాత గుప్తా, డెప్యూటీ కమీషనర్ కృష్ణయ్య, స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ అధికారి భరత్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts