మృతుని కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం.
అందజేసిన మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు..
వనపర్తి డిసెంబర్ 10 )
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా అట్టి రూపాయలను మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బి.బాలరాజు మృతుని కుటుంబానికి అందజేశారు. గోపాల్ పేట కు చెందిన టిఆర్ఎస్ కార్యకర్త యాపచెట్టు పెద్ద నరసింహ గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడన్న విషయాన్ని మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బాలరాజు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి వెంటనే స్పందించి దహన సంస్కారాల కోసం తక్షణమే ఐదువేల రూపాయలను పంపడం జరిగింది, అట్టి డబ్బులు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బాలరాజు మరికొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలతో: కలిసి మృతుని కుటుంబాన్ని దగ్గరికి వెళ్లి మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్. నాయకులు గాజుల కోదండం, దేవదాసు, సర్పంచ్ శ్రీనివాసులు కో ఆప్షన్ సభ్యులు మతిన్ తదితరులు పాల్గొన్నారు