సహస్ర చండీఘటాభిషేకంలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి డిసెంబర్ 10
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు మంగళవారం సందర్శించారు. అక్కడ జరిగిన సహస్ర చండీఘటాభిషేకంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దత్తాత్రేయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయం. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని సహస్ర చండీఘటాభిషేకం నిర్వహిస్తున్నారు. నేను పాల్గొనడం ఆనందం. ఎమ్మెల్యే మదన్ రెడ్డిఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఆలయానికి వచ్చే రహదారిని సీసీ రోడ్చేస్తాం. పూజారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చేలా కృషి చేస్తాం.అరవై లీటర్ల వాటర్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల వచ్చే లా కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ అయ్యాక దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. అర్చకులకు 010 అక్కౌంట్ ద్వారా అర్చకులకు, దేవాలయ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. దూప దీప నైవేద్యాల కసం రెట్టింపు పారితోషకాన్ని సీఎం ఇస్తున్నారు. నర్సాపూర్ లో మంజీర నది ఒడ్డున ఉన్న మంచి పుణ్యక్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం. యజ్ఞం పూర్తవడానికి, ఆలయ అభివృద్ధికి నా వంతు సాయంఅందిస్తానని అన్నారు. కాళేశ్వరం పూర్తయితే మంజీర నది కళకళలాడుతుంది. గోదావరి నీటితోమంజీర నిండుతుందని మంత్రి అన్నారు.