ఓ మహిళకు ముంబయిలో ఉద్యోగం వచ్చింది. ఆమె ఒంటరిగా వెళ్లి ఉద్యోగంలో చేరారు. ఆమెకు నివసించటానికి ఇల్లు దొరికింది. ఈ విషయాలను తన భర్తకు తెలిపేందుకు SMS ఫీడ్ చేసి పంపింది.
ఆ SMS భర్తకు బదులు పొరపాటున వేరొకరికి వెళ్ళింది. అతను అప్పుడే చనిపోయిన తన భార్యకు అంత్యక్రియలు చేసి వచ్చాడు. ఆ SMS చదివి స్పృహ తప్పాడు. ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇంతకు ఆ SMS లో ఏమని ఉందంటే..
నేను క్షేమంగా చేరాను. ఇక్కడ ఉండేందుకు చోటు కూడా దొరికింది. నా గురించి మీరు దిగులు పడొద్దు. వీలుపడితే ఒకట్రెండు రోజుల్లో మిమ్మల్ని తీసుకెళ్తా.
ఇట్లు
మీ భార్యామణి
అది అసలు సంగతి..