YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళ హత్యకేసులో నిందితుడు ఆరెస్టు ఏలూరు

మహిళ హత్యకేసులో నిందితుడు ఆరెస్టు ఏలూరు

మహిళ హత్యకేసులో నిందితుడు ఆరెస్టు
ఏలూరు  డిసెంబర్ 10.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో వెంకటా పురం లో ఈనెల 7వ తేదీన జరిగిన పాలేటి సత్యవతి హత్య కేసులో  నిందితులను అరెస్టు చేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన గల్లా శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. చింతల పూడి గ్రామంలోని భూతవైద్యుడు ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. పూజలు చేస్తే అనారోగ్యం తగ్గుతుందని చెప్పాడు. మీ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తులే కారణమని తెలిపి క్షుద్ర పూజల కోసం లక్షా 50 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని 30 వేల రూపాయలు భూతవైద్యుడు తీసుకొని పూజ సామాగ్రి తీసుకొని శ్రీనివాస రావు ఇంట్లో క్షుద్ర పూజలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తన అనారోగ్యానికి పాలేటి సత్యవతి ఆయన భర్తని కోపం పెంచుకున్న గల్లా శ్రీనివాసరావు,  సత్యవతిపై దాడి చేసి  నిమ్మ తోటలో పనిచేసే పారతో గట్టిగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది.దీనిపై కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Related Posts