YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు బిల్లులకు ఆమోదం

మూడు బిల్లులకు ఆమోదం

మూడు బిల్లులకు ఆమోదం
విజయవాడ, డిసెంబర్ 10,
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌ చట్టంలో సవరణలు చేసిన బిల్లు, టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ.. హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, మద్యం రేట్లు పెంచేందుకు ఎక్సైజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టింది. 
రాజధాని రైతులకు ఊరట
విజయవాడ, డిసెంబర్ 10,
ఏపీ అసెంబ్లీలో రెండో రోజు ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరిగింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని.. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం ఏర్పడిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా రాజధాని ఉండాలని.. అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారుటీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని.. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. టీడీపీ హయాంలో రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పే ప్రయత్నం చేశానన్నారు. ఇక ఇండియా మ్యాప్‌లో అమరావతిని గుర్తించకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని బొత్స వ్యాఖ్యానించారు.అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతులకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని చెప్పడం శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బావుంటుందని టీడీపీ చెబుతోంది.

Related Posts