YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 అమెరికాకు  షా స్ట్రాంగ్ కౌంటర్

 అమెరికాకు  షా స్ట్రాంగ్ కౌంటర్

 అమెరికాకు  షా స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 10,
పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై యూఎస్‌ కమిషన్స్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడం (యూఎస్‌ సీఐఆర్‌ ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే హోం మంత్రి అమిత్‌ షా సహా కీలక నేతలపై ఆంక్షలు విధించే దిశగా ఆలోచించాలని ట్రంప్‌ సర్కార్‌ను కోరింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే క్రమంలో ముస్లింలను మినహాయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ బిల్లు ప్రమాదకరమని, భారత్ తప్పుడు దోవలో వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.యూఎస్ సీఐఆర్ఎఫ్ అభ్యంతరాలపై భారత్ స్పందించింది. పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా ప్యానెల్ చేసిన ప్రకటన సరైంది కాదని, ఈ విషయంలో దానికి ఎలాంటి అధికారం లేదని ప్రకటించింది. యూఎస్ సీఐఆర్ఎఫ్ గత రికార్డును పరిశీలిస్తే.. పౌరసత్వ బిల్లు విషయంలో అది చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించలేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయంలో అమెరికా కమిషన్‌కు ఉన్న పరిజ్ఞానం పరిమితమని, ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం దానికి లేదని స్పష్టం చేసింది. అమెరికా కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదం తెలిపింది. బుధవారం ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు రానుంది. ఉభయ సభల్లో ఆమోదం పొంది.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం పొందుతారు.

Related Posts