YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వని పాపానికి శిక్ష అనుభవించా : తమ్మినేని

ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వని పాపానికి శిక్ష అనుభవించా : తమ్మినేని

ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వని పాపానికి శిక్ష అనుభవించా : తమ్మినేని
విజయవాడ, డిసెంబర్ 10, 
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్, హాట్‌గా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాలను చేపట్టకుండా వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ మండిపడింది. వంశీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని- టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.దీంతో చంద్రబాబు ఇదేం పార్టీ ఆఫీసు కాదు.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన స్పీకర్ తమ్మినేని ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఆ తర్వాత స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. వల్లభనేని వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.వంశీ ప్రసంగం తర్వాత స్పీకర్ తమ్మనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైసీపీ ఆఫీసన్న మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ఎవరికీ జాగీర్ కాదని.. ప్రజల జాగీర్‌ మాత్రమేనని అన్నారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని.. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని తమ్మినేని అన్నారు.

Related Posts