రామ్ సౌతిండియా రికార్డ్
హైద్రాబాద్, డిసెంబర్ 10,
టాలీవుడ్ చాక్లెట్ బోయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని అరుదైన రికార్డును అందుకున్నారు. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్.. మాస్‌లో సరికొత్త స్టైల్‌ని ప్రజెంట్ చేశారు. అయితే, రామ్‌కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ విషయాన్ని ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా రుజువు చేసింది.రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వచ్చిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ డిజిటల్ రైట్స్‌ను ఆదిత్య మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో ‘దుందార్ ఖిలాడీ’గా అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో ఈ సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేయగా ఇప్పటి వరకు 140 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా.. హిందీ ప్రేక్షకులు మాత్రం యూట్యూబ్‌లో ఇరగబడి చూస్తున్నారు. అంతేకాదు.. సినిమా అద్భుతంగా ఉందంటూ తెగ లైకులు కొడుతున్నారు. దీంతో లైక్స్‌తో ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. యూట్యూబ్‌లో అతివేగంగా 1 మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక సౌతిండియన్ సినిమాగా ‘దుందార్ ఖిలాడీ’ నిలిచింది.తెలుగులో మిడ్ రేంజ్ హీరోగా ఉన్న రామ్.. యూట్యూబ్‌లో మాత్రం దూసుకుపోతున్నారు. రామ్ కెరీర్‌లో ఎన్నో వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100 మిలియన్‌ల వ్యూస్‌ని అందుకోగా, ఆ సినిమా హిందీ వర్షన్ 140 మిలియన్ల వ్యూస్‌ని దాటేసింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిందీ డబ్బింగ్ వర్షన్ ‘నెంబర్ 1 దిల్ వాలా’ కూడా 1 మిలియన్ లైక్స్‌కి అతి దగ్గరలో ఉంది. ‘హైపర్’, ‘శివమ్’ సినిమాలు కూడా హిందీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘హలో గురు ప్రేమ కోసమే’ హిందీ డబ్బింగ్ వర్షన్ ఈ రేంజ్‌లో రికార్డు సృష్టించింది అంటే.. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ వస్తే మరిన్ని కొత్త రికార్డులతో యూట్యూబ్ దిమాక్ ఖరాబ్ కావాల్సిందే..!