విజయవాడలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం పర్యవేక్షణలోనే విచారణ జరపాలని, ఏప్రిల్ 28లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను కోర్టు అనుమతి లేకుండా బదిలీ చేయరాదని హెచ్చరించింది.
విజయవాడలోని ఇబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007, డిసెంబర్‌లో ఆయేషా మీరా హత్యకు గురైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు..2008 ఆగస్టులో సత్యంబాబు అనే యువకుడ్ని నిందితుడిగా అరెస్ట్ చేశారు. అనంతరం హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010, సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ 2017, మార్చి 31న తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా సత్యంబాబును అన్యాయంగా ఇరికించారని ఖాకీలను కోర్టు తప్పుపట్టింది. హైకోర్టు నిర్ణయంపై ఆయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఖమ్మం ఎస్పీగా పనిచేసిన ..ఐ.పి.ఎస్. అధీకారి గౌరవనీయులైన ఏ.వి.రంగనాథ్ గారు ఈ కేసు విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో సత్యంబాబు నిర్థోషిగా హైకోర్టు తీర్పు వెలువరించింది.