YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ దీక్షకు అంతా సిద్ధం

పవన్ దీక్షకు అంతా సిద్ధం

పవన్ దీక్షకు అంతా సిద్ధం
కాకినాడ, డిసెంబర్ 11
జనసేన అధినేత పవన్ కళ్యాణ్  దీక్షకు  అంతా సిద్ధమైంది. కాకినాడలో చేసే ఈ దీక్షకు జనసేన పార్టీ ‘రైతు సౌభాగ్య దీక్ష’గా నామకరణం చేసింది.. ప్రభుత్వం రైతుల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్‌తో పవన్ ఈ దీక్షకు సిద్ధమయ్యారు. వరి పంట వేయడానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలుంటున్నాయని.. గిట్టుబాటు ధర లేక, ఖర్చులు రాబట్టుకోలేక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారంటోంది జనసేన.కొంతమంది ధాన్యం రైతులు తనను కలిసి వారి అవస్థల గురించి చెప్పారుని.. పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని మండపేట, పరిసర ప్రాంతాలలో పర్యటించి రైతులతో స్వయంగా మాట్లాడాను అన్నారు పవన్. అన్నదాతలు చెప్పిన మాటలు విన్న తర్వాతే మాటల్లో చెప్పలేనంత బాధ అనిపించింది అన్నారు. రైతులు నష్టాలపాలవుతున్నా సమాజంలో గౌరవం కోసం వ్యవసాయం చేస్తున్నామని రైతులు చెబుతున్నారన్నారు.కడుపు మండి 2011లో ఒకసారి కోనసీమ రైతులు పంట విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆనాడుదేశమంతా నివ్వెరపోయిందని.. అటువంటి ఆగ్రహాన్ని మనం రైతు నుంచి చూడకుండా ఉండాలంటే పాలకులు కళ్ళు తెరవాలి అన్నారు. వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండుగలా చేయాలని.. అటువంటి రోజు కోసమే 12న దీక్ష తలపెట్టామని.. ప్రతీ జనసైనికుడు రైతుకు సంఘీభావం తెలపాలి అన్నారు. వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నించాలి అన్ననారు.ఎకరాకు 35 వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరతో ఖర్చులు కుడా రావడం లేదన్నారు పవన్. కౌలు రైతులకు అదనంగా మరో 15 వేల రూపాయల కౌలు భారం మోయవలసి ఉందన్నారు. దీనివల్ల 75 కిలోల బస్తాకు సగటున ఇప్పుడు ఇస్తున్న కనీస మద్దతు ధర రూ.1361 ఉంటే అది రూ.2వేలు రూపాయలు చేసినప్పుడే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారన్నారు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నారని.. మరి దీనిపై ఆలోచించే వారు ఎవరు అని ప్రశ్నించారు. వారి దుస్థితిని జగన్‌ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ దీక్ష చేయాలని సంకల్పించానని చెప్పారు

Related Posts