YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

పార్లమెంట్ లో తెరాస ఎంపీల నిరసన

పార్లమెంట్ లో తెరాస ఎంపీల నిరసన

పార్లమెంట్ లో తెరాస ఎంపీల నిరసన
న్యూఢిల్లీ డిసెంబర్ 11,
పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఆందోళనకు దిగారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చెపట్టారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి నిధులు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సరిగ్గా ఇవ్వడంలేదరి వారు ఆరోపించారు. . ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల్లో రాష్ట్ర వాటా ఇప్పటి వరకు గతేడాది కంటే 2.13% తక్కువ ఇచ్చింది. వాస్తవంగా గత ఏడాదికంటే అదనంగా 6.2% రావాల్సి ఉండగా ఇంకా తక్కువయింది.  రావాల్సిన 8.3%కంటే.. తక్కువ వాటా నిధులు తెలంగాణకు వచ్చాయని వారు విమర్శించారు.  ఈ విషయంపై సీఎం కేసీఆర్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఈ నెల 7న లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని లేఖలో కేసీఆర్ కోరారు.

Related Posts