YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

రూ. 2 వేల నోట్ల రద్దు వార్తలు నిజం కాదు

రూ. 2 వేల నోట్ల రద్దు వార్తలు నిజం కాదు

రూ. 2 వేల నోట్ల రద్దు వార్తలు నిజం కాదు
న్యూఢిల్లీ డిసెంబర్ 11  
రూ. 2000 నోట్లను రద్దు చేస్తుందని వస్తున్న వార్తల్లో నిజంలేదని  కేంద్రం  క్లారిటీ ఇచ్చింది. రెండు వేల నోట్ల రద్దు విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ఠాగూర్  రాజ్యసభలో చెప్పారు.  రెండు వేల నోటు రద్దు చేసి తిరిగి  వెయ్యి నోటును ప్రవేశపెట్టనుందనే అపోహ ప్రజల్లో నెలకొందని  ఎంపీ విశ్వంభర్ ప్రసాద్ ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చారు. రెండు వేల నోట్లను  ప్రవేశ పెట్టడం వల్ల దేశంలో బ్లాక్ మనీ పెరిగిందని విశ్వంభర్ ప్రసాద్  అన్నారు. దీనిపై  మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ..2016 నవంబర్  నాలుగో తేదీ నాటికి అన్ని డినామినేషన్లలో కలిపి రూ. 17, 741.87 బిలియన్ల విలువైన నగదు చెలామణిలో ఉండగా, 2019 డిసెంబర్ 2 నాటికి ఆ విలువ రూ. 22, 356.48 బిలియన్లకు చేరుకుందని   వివరించారు. దేశంలో  బ్లాక్మనీ , నకిలీ కరెన్సీని అరికట్టేందుకు 2016 నవంబర్లో రూ. 500, రూ. 1000 నోట్లను  కేంద్రం రద్దు చేసింది.

Related Posts