YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మంత్రి కేటీఆర్ పీయేలని మోసాలు ఆరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

మంత్రి కేటీఆర్ పీయేలని మోసాలు ఆరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

మంత్రి కేటీఆర్ పీయేలని మోసాలు
ఆరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్ డిసెంబర్ 11 
మంత్రి కే.టి.ఆర్ పి.ఏ అని చెబుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరిలో నివసించే కార్తికేయ,  లాలాపేట్ కు చెందిన  ఫెడ్రిక్ స్నేహితులు.  గత కొంత కాలంగా వీరు మంత్రి కే.టి.ఆర్ పి.ఏ శ్రీనివాస్ అని చెబుతూ ప్రభుత్వ,  ప్రైవేట్ కార్యాలయాలలో సిబ్బందిని బెదిరించి పనులు చేయించుకుంటున్నారు.     కొన్ని రోజుల క్రితం తన కొడుకుకి వైద్యం చేయించడానికి డబ్బులు లేక శ్రీరాముల రాజు అనే వ్యక్తి కార్తికేయని సంప్రదించగా , తాను మంత్రి కే.టి.ఆర్ పీ.ఏ శ్రీనివాస్ అని చెబుతూ హాస్పటల్ కి పోన్ చేసాడు కార్తికేయ, రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఇపిస్తానని హాస్పిటల్ కి ఫేక్ పత్రాలు ఇచ్చాడు.  వైద్యం పూర్తి అయ్యాక పత్రాలు ఫేక్ అని తెలవడంతో బాదితుడు ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన ఘటకేషర్ పోలీసులు మల్కాజిగిరి ఎస్.వో.టి సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా కార్తికేయ పై నల్గొండ 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇదే కేసు నమోదు అయినట్లు మల్కాజిగిరి డి.సి.పి రక్షిత మూర్తి తెలిపారు. నిందితులు వద్ద నుంచి 1 లక్ష 75వేలు నగదు , 3 మొబైల్ ఫోన్స్ మరియు ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క ఫేక్ పత్రాలను స్వాదీనం చేసుకుని నిందితులను రిమాండ్ కి తరలిస్తునట్లు తెలిపారు.

Related Posts