ఆర్టీసీ మహిళా ఉద్యోగల నిరసన
నల్గోండ డిసెంబర్ 11
నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగినుల డ్యూటీల చార్ట్ మార్పుపై మహిళ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన అవకాశాన్ని.. స్థానిక అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించడం లేదు అన్న చందంగా తమ పరిస్థితి ఉంది అంటున్నారు. ఓవర్ టైం, డే డ్యూటీ, వీక్లీ ఆఫ్ ల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న విధానాలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత విధానమే బాగుందని కార్మికులు అంటుండగా..... తాత్కాలికంగా మారిన డ్యూటీని తీసుకోమని అధికారులు చెప్తున్నారు.. కానీ ఒక్కసారి కొత్త డ్యూటీలో చేరితే మళ్ళీ మార్పులు సాధ్యం కాదని.. అందుకే పూర్తి స్థాయిలో మహిళా కార్మికులకు సమ్మతమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాతే కొత్త డ్యూటీ చార్ట్ లను తయారు చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.