YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ రైతు పక్షపాతి

కేసీఆర్ రైతు పక్షపాతి

కేసీఆర్ రైతు పక్షపాతి
నల్గొండ డిసెంబర్ 11  
హలియా మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నూతన  వ్యవసాయ మార్కెట్ కమిటి పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు.  ఈ సందర్బంగా  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి  అంశాలను ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. లక్ష రూపాయల రుణమాఫీ తో రైతు శ్రేయస్సు మొదలైంది. రైతుబందు,రైతు భీమా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి దిక్షుచిలు. నీటిపారుదల రంగం తో పాటు విద్యుత్ రంగంలో సగం బడ్జెట్ వ్యవసాయ రంగానికేనని అన్నారు. ఐదు దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు. విత్తనాలు,ఎరువులు,విద్యుత్ కోతలతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో కీ నెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే. రైతుల డిమాండ్ మేరకే రబీకి నీటి విడుదల చేస్తున్నామని అన్నారు. వారాంతంలో ఆయకట్టు రైతాంగం ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి అన్నారు.

Related Posts