YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం 

 అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం 

 అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం 
ఆలయ డెప్యూటీ ఈవో  గోవిందరాజన్
తిరుపతి డిసెంబర్ 11
అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని ఆలయ డెప్యూటీ ఈవో  గోవిందరాజన్ తెలిపారు. నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతమైన నేపథ్యంలో బుధవారం శుక్రవారపుతోటలో వనమహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో  పి.బసంత్కుమార్ ఆదేశాల మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు సంతృప్తికరంగా వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకున్నారని వివరించారు. అర్చకులు సమయపాలనతో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారని, మీడియా ప్రతినిధులతో పాటు భక్తులు చక్కటి సహకారం అందించారని తెలిపారు. ఇంజినీరింగ్, విజిలెన్స్, అన్నప్రసాదం, వైద్య, ఆరోగ్య విభాగం, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలోని శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు మెరుగైన సేవలందించారని కొనియాడారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు  శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఆనంతరం వనమహోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉద్యోగులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందిస్తున్నట్లు తెలిపారు. 
అంతకు ముందు ఫ్రైడే గార్డెన్లో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి పనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆనంతరం మహా నివేదన, వనమహోత్సవం, ప్రసాద వితరణ చేశారు.  ఈ కార్యక్రమంలో అన్నదానం ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, డిఇ(ఎలక్ట్రికల్స్)  చంద్రశేఖర్, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాసులు, యూనిట్ అధికారి  అమరనాథరెడ్డి, అర్చకులు  ప్రతాప్స్వామి, ఏఈవో  శ్రీనివాసులు, సూపరింటెండెంట్  గోపాలకృష్ణారెడ్డి, ఎవిఎస్వో  నందీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి  జనార్ధన్రెడ్డి, ఆర్జితం ఇన్స్పెక్టర్  కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Posts