ఆర్టీసీ చార్జీలపై మండిపాటు
విశాఖపట్నం డిసెంబర్ 11
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి.నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని గట్టేక్కించాలంటే చార్జీలు తప్పదనే ప్రభుత్వ నిర్ణయంతో నేటి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి.అయితే ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తుల ధరలతో అల్లాడిపోతున్న ప్రజానికానికి ఆర్టీసీ చార్జీల మోతపై వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.పెరిగిన ధరలపై ఏపీలో పలు ప్రాంతాల్లో రాజీయపార్టీలు ధర్నాలతో హోరెత్తించాయి.ప్రజలు ప్రయాణానికి ఎక్కువగా ఆధారపడే ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో సామాన్యులపై భారం పడింది.దీని ప్రకారం సాధారణ, సిటీ బస్సులకు కి.మీ 10 పైసలు, ఇతర సర్వీసులకు అయితే కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచింది.తాజా పెంపుతో జిల్లాల వారీగా ఆర్టీసీ రీజియన్‌కు అదనంగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.దీనింతోనైనా ఆర్టీసీ మనుగడకు ఇబ్బందులు తొలగిపోతాయని అంచనాలు వేస్తోంది.