YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సచివాలయాల మౌలిక వసతులు పరిశీలించిన మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్

సచివాలయాల మౌలిక వసతులు పరిశీలించిన మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్

సచివాలయాల మౌలిక వసతులు పరిశీలించిన మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్
తుగ్గలి డిసెంబర్ 11 
తుగ్గలి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో గల సచివాలయాలను మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ మరియు తుగ్గలి స్పెషల్ ఆఫీసర్ షేక్ లాల్ మహమ్మద్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పర్యటనలో భాగంగా 19 సచివాలయాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి భూములను మరియు భవనాలను పరిశీలించారు.కొన్ని పంచాయతీలలో ఏర్పాటుచేసిన సచివాలయాలను పరిశీలించారు.అదేవిధంగా సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.వాలంటీర్లకు మరియు సచివాలయ ఉద్యోగులు నిర్వహించవలసిన విధుల గురించి వారికి తెలియజేశారు. అదేవిధంగా సచివాలయంకు ప్రతిరోజు వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగుల హాజరు కావాలని తెలియజేశారు.సచివాలయం నిర్మాణం కొరకు స్థలాలు లేని పంచాయతీలను గుర్తించామని తెలియజేశారు.మరికొద్ది రోజుల్లో సచివాలయానికి సంబంధించిన కంప్యూటర్లు మరియు ఫర్నిచర్ అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు.బుధవారం మరియు గురువారం మండలంలో పర్యటించి శుక్రవారం రోజున జిల్లా అధికారులకు నివేదిక పంపుతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీర రాజు, పంచాయతీ కార్యదర్శులు అంకాలప్ప, గోపాల్,కార్తీక్,సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts