YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 25, 26 వ తేదీల్లో సూర్యగ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత

 25, 26 వ తేదీల్లో సూర్యగ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత

 25, 26 వ తేదీల్లో సూర్యగ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత
తిరుపతి డిసెంబర్ 11  
ఈ నెల  25, 26వ తేదీల్లో సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 26 వ తేదీ ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.ఆరు గంటలు ముందుగానే ఆలయం తలుపులు మూసివేస్తామని అధికారులు చెప్పారు. 25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌ వరకు ఆల‌యంలో దర్శనానికి అనుమతి ఉండదన్నారు. అంటే మొత్తం 13 గంట‌ల సేపు ఆలయాన్ని మూసి ఉంచుతారు. గ్రహణశుద్ధి తర్వాత 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి సర్వదర్శనం మొదలవుతుంది.

Related Posts