YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రోడ్లు కాదివి.. (ఆదిలాబాద్)

రోడ్లు కాదివి.. (ఆదిలాబాద్)

రోడ్లు కాదివి.. (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, డిసెంబర్ 11 (న్యూస్ పల్స్): రోడ్లు గుంతలమయం అయ్యాయి. తారు లేచి మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణం నరకంగా మారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి రహదారుల మరమ్మతుకు ఏడాది క్రితం పంచాయతీ రాజ్‌, రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలు తయారు చేస ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నిధులు మంజూరు కాక రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. నిర్మల్‌ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 129 కిలోమీటర్లకు గాను రూ.59 కోట్లు అంచనాలు తయారు చేసి పంపించారు. దెబ్బతిన్న రోడ్లపై తారుపై తారు నిర్మాణానికి, కొన్ని కొత్త రోడ్ల మంజూరుకు నివేదికలు పంపారు.ప్రతిపాదనలు పంపించిన రోడ్ల వివరాలు ఇలా ఉన్నాయి.సారంగాపూర్‌ మండలంలో పునర్నిర్మాణం(రినివల్‌) రోడ్లు లక్ష్మీనగర్‌ తండా నుంచి యాకర్‌పల్లి, ఆర్‌బీ(ఆర్‌అండ్‌బీ) రోడ్డు నుంచి యాకర్‌పల్లి వయా జాం రోడ్డు నిర్మాణం, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బోరిగాం, బోరిగాం నుంచి వంజర మీదుగా గొడిశర, ఆర్‌బీ రోడ్డు నుంచి రవీందర్‌నగర్‌, శాంతినగర్‌ నుంచి దుప్యాతండా మీదుగా పెండల్‌దరి మీదుగా ఇప్పచెలిమ, జాం నుంచి సేవానగర్‌ మీదుగా దుర్గానగర్‌, ధని నుంచి రాజరాజేశ్వర తండా ఎక్స్‌రోడ్డు, జాం నుంచి మహావీర్‌తండా ఎక్స్‌ రోడ్డు, ఆర్‌బీ రోడ్డు నుంచి బోరింగ్‌ తండా మీదుగా లక్ష్మినగర్‌తండా, ఫార్మేషన్‌ రోడ్డు అడెల్లి నుంచి అడెల్లి తండా వరకు, పీఆర్‌ రోడ్డు నుంచి దేవి తండా, కొత్త రోడ్డు ప్యారమూర్‌ నుంచి కదిలి వరకు రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. నిర్మల్‌ మండలంలో చిట్యాల్‌ ఆర్‌బీ రోడ్డు నుంచి ముజ్గి, నటరాజ్‌మిల్‌ నుంచి సోఫీనగర్‌, ఆర్‌బీ రోడ్డు నుంచి కొండాపూర్‌ గ్రామం వరకు, ఆర్‌బీ రోడ్డు నుంచి సోఫీనగర్‌ మీదుగా సిద్దాపూర్‌ వరకు రోడ్డు పునర్నిర్మాణాలకు నివేదికలు పంపారు. మామడ మండలం, అనంతపేట్‌ నుంచి ఆర్‌బీ బీటీ రోడ్డు నిర్మాణం, దిమ్మతుర్తి నుంచి కప్పనపల్లి, ఎన్‌హెచ్‌ రహదారి నుంచి బూర్గుపల్లి శివాలయం, అనంతపేట్‌ ఆర్‌బీ రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ , జిల్లా పరిషత్‌ రోడ్డు నుంచి కొత్తలింగంపల్లి, జడ్పీ రోడ్డు నుంచి మురళిగూడ మీదుగా గాయద్‌పల్లి, సాంగ్వీ నుంచి ఆర్‌బీ రోడ్డు, కొరటికల్‌ నుంచి పోతారం వరకు, ఎన్‌హెచ్‌-44 రహదారి నుంచి పులిమడుగు, రాచకోట నుంచి మల్కపల్లి వరకు, తాండ్ర నుంచి రాంపూర్‌ మీదుగా పోచమ్మగుడి, ఎన్‌హెచ్‌-44 నుంచి దంజీనాయక్‌తండా, ఆర్‌బీ రోడ్డు నుంచి భాగ్యనగర్‌ మీదుగా శాంతినగర్‌ తండా, ఎన్‌హెచ్‌-44 నుంచి సోన్‌పేట్‌, కొత్త రోడ్డు వెంటాపూర్‌ నుంచి సుర్జాపూర్‌ వరకు నిర్మాణాలు చేయాల్సి ఉంది. దిలావర్‌పూర్‌ మండలంలో ఆర్‌బీ రోడ్డు నుంచి గుండంపల్లి వరకు, అర్‌బీ రోడ్డు దిలావర్‌పూర్‌ నుంచి బన్సపల్లి మీదుగా ఎల్లమ్మ ఆలయం, ఒడ్డెపల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి చిట్యాల్‌ ఎక్స్‌ రోడ్డు వరకు, జగదంబతండా ఆర్‌బీ రోడ్డు నుంచి మాడెగాం మీదుగా కదిలి, లోలం నుంచి బన్సపల్లి ఎక్స్‌ రోడ్డు మీదుగా దిలావర్‌పూర్‌ లంబాడితండా(టి) వరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.

Related Posts