YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన ఎమ్మెల్యే..రాపాక దారెటు..

జనసేన ఎమ్మెల్యే..రాపాక దారెటు..

జనసేన ఎమ్మెల్యే..రాపాక దారెటు..
విజయవాడ, డిసెంబర్ 11  
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. పార్టీ మారే విషయమై ఆచితూచి స్పందించారు. ఆరు నెలలపాటు తాను జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానన్న ఆయన.. మీడియా ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు గుప్పించిన రాపాక.. గురువారం కాకినాడలో పవన్ చేపడుతున్న రైతు సౌభాగ్య దీక్షకు వెళ్లడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటమే దీనికి కారణం అన్నారు.పవన్ ఇంగ్లిష్ మీడియం వద్దనలేదు..దళితుల పిల్లలు కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడాలని రాపాక ఆకాంక్షించారు. పవన్ ఇంగ్లిష్ మీడియం వద్దని చెప్పలేదు.. తెలుగు మీడియం కూడా కొనసాగించాలని చెప్పారన్నారు. పవన్ చేపడుతున్న దీక్షపై తాను అసెంబ్లీలో ప్రస్తావించడానికి సందర్భం రాలేదన్నారు. జగన్ సభలో మాట్లాడినప్పుడు తాను లేనని రాపాక చెప్పారుపవన్ రెండు బెత్తం దెబ్బలు వేయాలని రోజా అసెంబ్లీలో మాట్లాడారు. మేం దాన్ని వ్యతిరేకించి మాట్లాడలేదని రాపాక స్పష్టం చేశారు. నేను ఆరు నెలలుగా జనసేనలోనే ఉన్నారు. మీరు గుచ్చి గుచ్చి అడుగుతుంటే... ఏమైనా జరగొచ్చు. భవిష్యత్తు గురించి ఏం చెప్పగలం అని రాపాక తెలిపారు.పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయమై తర్వాత స్పందిస్తానన్న రాపాక.. పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. కొన్ని లోపాలను తమలో తాము పరిష్కరించుకుంటామన్నారు.ఇప్పటికైతే తాను జనసేనలోనే ఉన్నానని చెప్పడం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేననడం, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని స్పష్టం చేయడం ద్వారా రాపాక వైఎస్సార్సీపీలోకి వెళ్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయ్యింది. జగన్ చిత్రపటానికి గతంలో రాపాక పాలాభిషేకం చేశారు. ఇప్పుడేమో ఇంగ్లిష్ మీడియంపై ప్రశంసలు గుప్పించారు. రాపాక చెప్పినట్టు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏం చెప్పలేం కదూ

Related Posts