YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

లాభాల్లో  స్టాక్ మార్కెట్లు...

Highlights

✺ నిఫ్టీ 50లో గెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌టీపీసీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ షేరు 5 శాతానికి పైగా పెరిగింది.
✺ అదేసమయంలో యస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్, హిందాల్కో షేర్లు నష్టాల్లో ఉండిపోయాయి. యస్ బ్యాంక్ దాదాపు 14 శాతం కుప్పకూలింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా పరుగులు పెట్టింది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.75 శాతం తగ్గుదలతో 63.86 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.71 శాతం క్షీణతతో 58.84 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 70.85 వద్ద కదలాడుతోంది.

లాభాల్లో  స్టాక్ మార్కెట్లు...

లాభాల్లో  స్టాక్ మార్కెట్లు...
ముంబై, డిసెంబర్ 11, 
దేశీ స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేకులు పడ్డాయి. మంగళవారం పడిపోయిన బెంచ్‌‌‌మార్క్ సూచీలు బుధవారం లాభాల బాటపట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్ల ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇండెక్స్‌లు రోజంతా రేంజ్‌బౌండ్‌లోనే కదలాడాయి.ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నం కల్లా నష్టాల్లోకి జారుకుంది. అయితే చివరి గంటలో ఐటీ, పవర్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మళ్లీ సూచీలు లాభాల్లోకి వచ్చేశాయి. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 40,413 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 11,910 వద్ద క్లోజయ్యాయి.
 

Related Posts