YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

నాణ్యత పేరుతో రైతుకు నష్టం చేస్తున్న మిల్లర్ల్లు    తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి

నాణ్యత పేరుతో రైతుకు నష్టం చేస్తున్న మిల్లర్ల్లు    తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి

నాణ్యత పేరుతో రైతుకు నష్టం చేస్తున్న మిల్లర్ల్లు
        తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్11 
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ జిల్లాలో చూసిన కనపడుతుంది. ఒక దిక్కు రైతు పండించిన ప్రతి గింజను కొంటాం అని చెపుతున్న కొనుగోలులో జాప్యం కనపడుతుతుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయిన గ్రామపంచాయతీ కి చెందిన రైతు 20 రోజులుగా తన ధాన్యాన్ని తూకం వేస్తాలేరన విసిగిపోయి తన దాన్యంకు నిప్పంటించుకోవడం జరిగింది.ఇలా తూకం వేయడంలో ఆలస్యం తో రైతులంతా అనేక అవస్థలు పడుతున్నారు. వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.మరోదిక్కు రైతు వద్ద నాణ్యత ప్రమాణాలు చూసి తూకం వేసి మిల్లర్ల వద్దకు తీసుకెళ్లినక నాణ్యత లోపం పెరు చెప్పి 2లేదా 3 కిలోల తరుగు తీస్తున్నారు. ఒక్కసారి తూకం అయినక రైతుకు ఎందుకు సంబంధం ఉంటుంది. ఈ రకంగా నాణ్యత పేరుతో రైతుకు నష్టం చేస్తున్నారు. గన్ని బస్తాలు ఇవ్వడకి ఆలస్యం, తూకం వేయడానికి ఆలస్యం, ఇలా చేయడం వల్ల రైతుకు డబ్బులు రావడానికి ఆలస్యము అవుతుంది. ఇంకో దిక్కు పట్టా పసుపుస్తకం ఉంటేనే ధాన్యం కొంటున్నారు మరి ప్రభుత్వం పసుపుస్తకాలు ఇవ్వకుంటే రైతు ఎక్కడినుండి పుస్తకం తీసుకొస్తాడు. గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం తీసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు రైతులకు కొన్న వారం రోజుల్లో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.సి. సి. ఐ. కేంద్రాల్లో పత్తి పంటను నాణ్యత ప్రమాణాలపేరుతో పత్తి కొనకపోవడంతో తక్కువ ధరకు మిల్లర్లకు అమ్ముకునే పరిస్థితి ఎక్కడ చూసినా కనిపిస్తుంది.పూర్తి స్థాయిలో కొంటున్నాం అని చెప్పుతున్నప్పటికి నామ మాత్రంగానే కొంటున్నారు అనడానికి నిన్న జమ్మికుంట మార్కెట్ కి 185 ట్రాలీలు వస్తే కేవలం 50 ట్రాలీలు మాత్రమే కొనుగోలు చేసినారు.ఎదో ఒక వంక తో సి. సి. ఐ. రిజెక్ట్ చేయడం రైతు గత్యంతరం లేక మిల్లర్లకు అమ్ముకోవడం ఆ మిల్లర్లు తిరిగి మద్దతు ధర కే సి.సి. ఐ. కి అమ్ముకోవడం జరుగుతుంది. అంటే సి .సి. ఐ. కేంద్రాలు రైతులకు కాకుండ మిల్లర్లకు లాభం చేకూరేలా చేస్తున్నారు.మరో దిక్కు మార్కెట్ కు వచ్చిన పత్తిని ఎలాంటి రికార్డులు లేకుండానే మిల్లరు కొనుగోలు చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందొ అర్ధం అవుతుంది.అనేక నిభందనలు పెట్టుతున్నారు. ఒక ఎకరానికి 12 క్వింటాలు కొంటామని అంటున్నారు అంటే దిగుబడి ఎక్కువ వస్తే ఎవరికి అమ్ముకోవాలి.? మరోదిక్కు కౌలు రైతుల పరిస్థితి మరీ అద్వనం భూమి యజమాని వచ్చి బయోమెట్రికు పెట్టాలి అని ఒక నిబంధన పెట్టినారు దీని వల్ల కౌలు రైతుల బాధలు ఇంత అంత కాదు భూయజమని ఎక్కడో ఉంటాడు ఆయనను రమ్మంటే ఎప్పుడు రావాలి ఈ రైతు ఎప్పుడు అమ్ముకోవాలి. కౌలు రైతులకైన, పట్టా పాసు పుస్తకం లేని వారికి అయిన గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువుకరణ పత్రం తీసుకొని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సి. సి. ఐ కేంద్రాలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు..కావాలని నాణ్యత పేరు మీద పత్తి పంటను రిజెక్ట్ చేసి మిల్లర్లకు అమ్ముకునే విధముగా చేసి మిల్లర్ల నుండి మళ్ళీ సి. సి. ఐ కేంద్రం కొనుగోలు చేసిన దాంట్లో విచారణ జరిపి బాద్యుల పై చర్యలు తీసుకోవనిప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేసారు.

Related Posts