బాలికల ఆత్మరక్షణకే కరాటే శిక్షణ
వనపర్తి డిసెంబర్11
మహిళలు,విద్యార్థినిలపై జరుగుతున్న హింసాత్మకదాడుల నుండి తనకు తానుగా స్వయంగా రక్షించుకునేందుకు.. విద్యార్థినిలలో మనోధైర్యాన్ని నింపేందుకే ప్రత్యేకంగా కరాటే (మార్షల్ ఆర్ట్స్) ఉచిత శిక్షణను ఇప్పిస్తామని డిఏస్పి కిరణ్ కుమార్ తెలిపారు.విద్యార్థులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని వారికి ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అన్ని పాఠశాలలోని విద్యార్థినిలు అందరికీ కూడా కరాటే శిక్షణ తరగతులు నిర్వహింప చేస్తామని పేర్కొన్నారు .కరాటేతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉందని అదేవిధంగా మనలో ఏదో తెలియని ధైర్యం పెంపొందుతుందని చెప్పారు. కరాటే శిక్షణ నిరంతరం కొనసాగుతుందని మహిళల రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితులలోనూ రాజీ పడబోమని, ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూ పోలీసుశాఖ అండగా ఉన్నామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరి పై ఉన్నదని సీఐ తెలిపారు.మార్షల్ ఆర్ట్స్ బాలికలు మైదానంలో విద్యార్థినిలకుఅద్భుతంగా సెల్ఫ్ డిఫెన్స్ ప్రదర్శనలను చేసి చూపించారు